చంద్రబాబు 2024లో చనిపోతాడు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు.. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు.' అని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.

New Update
MP Gorantla Madhav: నాకు టికెట్ ఇవ్వకపోతే..ఎంపి గోరంట్ల మాధవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఆయన నోరు పారేసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు చస్తాడని. జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాధవ్‌ అన్నారు. వైసీపీ మొదలు పెట్టిన సామాజిక యాత్రలో భాగంగా హిందూపురంలో ఆయన శుక్రవారం పర్యటించారు.

''చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు. ఇక సీఎం జగనే. ఆయనను ఎదిరించే నాయకులు కూడా లేరు. పవన్‌ కొన్ని రోజులు రాజకీయాలంటూ ఊగుతాడు. ఆ తరువాత సినిమాలు అంటూ వెళ్లిపోతాడు'' అంటూ వ్యాఖ్యనించారు.

Also read: జైల్లోనే చంపే కుట్ర జరుగుతోంది…ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సంచలన లేఖ..!!

ఇక జనసేన అధినేత పవన్‌ పైన కూడా మాధవ్‌ నోరు పారేసుకున్నారు. పవన్‌ ప్రస్తుతం వారాహి యాత్ర పూర్తి చేసి..ప్రస్తుతం పారిపోయే యాత్ర చేస్తున్నారంటూ విమర్శించారు. లోకేష్‌ ఏమో ఢిల్లీ చుట్టు తిరుగుతున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము అటు టీడీపీకి కానీ, ఇటు జనసేనకి కానీ లేవంటూ ధ్వజమెత్తారు.

ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ టీడీపీ నాయకులు ముందు నుంచి ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఆయనను జైలులోనే అంతం చేయాలని చూస్తున్నారని నారా లోకేష్‌ అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో మాధ‌వ్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి.

మరో వైపు.. తనను జైల్లోనే చంపే కుట్ర జరుగుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సంచలన లేఖ రాశారు. ఈనెల 25వ తేదీన రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టుకు అందించారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖను రాశారు చంద్రబాబు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందన్న చంద్రబాబు.. జైల్లోకి వచ్చిన్నప్పుడు అనధికారికంగా తన ఫొటోలు, వీడియోలు తీశారని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తన వీడియోలను లీక్ చేశారని చంద్రబాబు ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు