Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే!

 గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది.

New Update
Google: గూగుల్ లో కొత్త ఫీచర్‌ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...!

AI : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI)...ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే నడుస్తోంది. దీన్ని జనాలు వేలం వెర్రిగా వాడుతున్నారు. ఇందుకు గూగుల్(Google) కూడా అతీతం కాదు అంటోంది. ప్రపంచంలోనే ఎవ్వరూ కొట్టలేనంతగా పాతుకుపోయింది గూగుల్. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దీన్ని వాడకుండా ఎవ్వరూ ఉండలేరు. డబ్బుల సంపాదనలో కూడా దీన్ని ఎవ్వరూ, ఎప్పుడూ మించలేరు. అలాంటి గూగుల్ ఇప్పుడు తన కంపెనీ ఉద్యోగులను భారీ ఎత్తున ఇంటికి పంపించేందుకు రెడీ అయింది. దాదాపు 30 వేల మంది ఉద్యోగాలు పోనున్నాయని సమాచారం.

Also Read : ఏకంగా 600 మంది హాలీవుడ్ నటులు.. 2 దేశాల టెక్నీషియన్స్.. కన్నప్పపై మోహన్ బాబు ఊహించని అప్డేట్స్!

ప్రపంచవ్యాప్తంగా 70 ఆఫీసులు, 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 200 లక్షల కోట్ల కంపెనీగా మారేందుకు కొద్ది దూరంలోనే ఉంది. కానీ ఇప్పుడు టెక్ దిగ్గజం సంచలనం నిర్ణయాలు తీసుకుంటోంది. ఏఐని నమ్ముకుని తన ఉద్యోగుల మెడకు కత్తిని వేలాడదీయడానికి రెడీ అయింది. ఏఐతో ఉద్యోగాల(Jobs) మనుగడ కష్టమే అని చెబుతున్న ఎలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాల మాటలను నిజం చేసే పనిలో పడింది. గూగుల్ తన యాడ్స్ సేల్స్ యూనిట్ విభాగంలో ఏఐ ఆధారిత ఆటోమేటిక్ డిజైన్ టూల్ ను వాడాలని డిసైడ్ అయింది. దీని వల్ల మనుషులతో పని లేకుండా ఏఐ టూల్స్ తో యాడ్స్ డిజైన్ చేసుకోవచ్చును. దీనివల్ల బోలెడంత టైమ్, డబ్బు కూడా సేవ్ అవుతాయి.అందుకే గూగుల్ ఇప్పుడు దీన్ని చూస్ చేసుకుంటోంది.

ఏఐ వల్ల గూగుల్ మరినని లాభాలు సంపాదించవచ్చును. అందుకే డిపార్ట్ మెంట్ వైడ్ గూగుల్ యాడ్స్ మీటింగ్ లో యాడ్స్ విభాగంలో పని చేసే ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేయనుంది. దీంతో ఇప్పుడు ఆ విభాగంలో పని చేస్తున్న 30 వేలమంది ఉద్యోగుల జాబ్స్ ఊడనున్నాయి. వీరందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.

Also Read : మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ఎఫెక్ట్!

Advertisment
తాజా కథనాలు