Google Pay: గూగుల్‌ పే యూజర్లకు అలర్డ్‌.. ఆ యాప్స్‌ వాడొద్దని గూగుల్ హెచ్చరిక..

గూగుల్‌ పే యాప్‌తో లావాదేవీలు జరిపే సమయంలో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వాడొద్దని గూగుల్‌ తమ యూజర్లకు సూచించింది. సైబర్‌ నేరగాళ్లు వీటి ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని కాజేస్తున్నట్లు తెలిపింది.

New Update
Google pay : అగ్రరాజ్యంలో గూగుల్ పే బంద్..మరి మన సంగతేంటి ? మన డబ్బు సేఫేనా?

ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ పేమెంట్స్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీయం లాంటి యాప్స్‌తో క్షణాల్లోనే డబ్బులు పంపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగల్‌ పే వినియోగదారులకు గూగుల్‌ పలు కీలక సూచనలు చేసింది. గూగుల్ పే యాప్‌తో లావాదేవీలు జరిపే సమయంలో ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించవద్దని.. వాటిని ఓపెన్ చేసి ఉంచకూడదని సూచించింది. సైబర్‌ నేరగాళ్లు వినియోగదారుల మొబైల్‌లో నుంచి గూగుల్‌ పే యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని కాజేస్తున్నట్లు గుర్తించామని తెలిపింది.

Also read: డీప్‌ఫేక్‌ వీడియోలు చేస్తే ఇక అంతే సంగతులు.. కేంద్రం కీలక నిర్ణయం..

తమ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు.. ఎలాంటి మోసపూరిత లావాదేవీలు జరగకుండా వీటిని అరికట్టడానికి అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని పేర్కొంది. గూగుల్ యాప్‌ ద్వారా జరిగే సైబర్ నేరాలను అడ్డుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని. ఇందుకోసం యూజర్లు కూడా తాము చెప్పిన కొన్ని సూచనలు పాటించాలని కోరింది. గూగుల్‌ యాప్ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ఫోన్‌లో ఉన్న స్క్రీన్‌ షేరింగ్ యాప్‌లు వాడొద్దని.. థర్డ్‌పార్టీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొమ్మని గూగుల్ పే తమ యూజర్లను కోరదని తెలిపింది. ఒకవేళ ఎవరైన గూగుల్ పే ప్రతినిధి అని చెప్పి.. థర్డ్‌పార్టీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొమ్మని చెబితే వాటిని కూడా నమ్మోద్దని చెప్పింది. ఇలా జరిగితే వెంటనే 'గూగుల్‌ పే'కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

ఈ స్క్రీన్‌ షేరింగ్ యాప్‌ల ద్వారా మరో చోటు నుంచి ఇతరులు మీ డివైజ్‌ను తమ అదుపులోకి తీసుకోవచ్చని.. సాధారణంగా వీటిని రిమోట్‌ వర్కింగ్‌ కోసం లేదా ఫోన్‌, కంప్యూటర్లలో ఏదైనా సమస్య ఉంటే మరో చోటు నుంచి దాన్ని సరిచేసేందుకు వినియోగిస్తుంటారని తెలిపింది. ఎనీ డెస్క్‌, టీమ్‌ వ్యూయర్‌ వంటివి ఎక్కువగా వీటి కోసం వినియోగిస్తుంటారని పేర్కొంది. అయితే ఈ మధ్య సైబర్‌ నేరగాళ్లు.. స్క్రీన్‌ షేరింగ్ యాప్‌ల ద్వారా యూజర్ల ఫోన్‌ నుంచి ఏటీఎం, డెబిట్‌కార్డు వివరాలు దొంగిలించడంతోపాటు ఓటీపీలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి నేరాలపై తమకు తరచుగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. స్క్రీన్‌ షేరింగ్ యాప్‌లు వాడొద్దని గూగుల్ పే యూజర్లకు సూచనలు చేసింది.

Advertisment
తాజా కథనాలు