Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్‌.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్‌ !

బెంగళూరు ట్రాఫిక్‌ గురించి గూగుల్ మ్యాప్స్‌ చూపించిన అంశం వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ఫొటో ఓ వ్యక్తి ఎక్స్‌లో చేశాడు.

Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్‌.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్‌ !
New Update

కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయి. అయితే తాజాగా బెంగళూరు ట్రాఫిక్‌ గురించి గూగుల్ మ్యాప్స్‌ చూపించిన అంశం నెట్టింటా వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపించింది. ఈ విషయాన్ని ఆయుష్ సింగ్‌ అనే ఓ వ్యక్తి దాని స్ర్కీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశాడు.


Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో కేఆర్‌పురం రైల్వే స్టేషన్‌ నుంచి గరుడాచార్‌ పాళ్లలో బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లేందుకు 44 నిమిషాల సమయం పడితే.. అదే దూరం నడిచి వెళ్లేందుకు 42 నిమిషాల సమయం పడుతోందని గూగుల్‌ మ్యాప్స్‌లో సూచించింది. ఇలాంటిది బెంగళూరులో మాత్రమే సాధ్యమవుతోందని ఆయుష్ సింగ్‌ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై నెటీజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. భారత్‌కు బెంగళూరు ట్రాపిక్‌ రాజధాని అని.. ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు.

Also Read: భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు

#telugu-news #bengaluru #bengaluru-traffic #traffic
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి