Google Maps: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు చాలామంది గూగూల్ మ్యాప్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు దీన్ని నమ్మి దార్లు తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది నదులు, చెరువులు, కాలువలోకి కూడా దూసుకెళ్లిన ఘటనలు జరిగాయి. అయితే తాజాగా కొంతమంది విద్యార్థులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గుగూల్ మ్యాప్‌ను నమ్ముకొని దారితప్పి దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు.
Also Read: ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు.. ఎక్కడంటే
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని (Odisha) కటక్‌లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. బైక్స్‌పై అక్కడికి చేరుకున్నాక తిరుగు ప్రయాణంలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. ఆకలి, దాహం, అలసటతో చాలాసేపు ప్రయత్నించారు. దాదాపు 11 గంటల పాటు అడవిలోనే భయం భయంగా గడిపారు. ఎట్టకేలకు పోలీసులకు సమాచారం అందిచగలిగారు. దీంతో రెస్క్యూ టీం విద్యార్థులను కనిపెట్టి రక్షించింది. అయితే ఆలయానికి వెళ్లాక.. మేమున్న ప్రదేశం నుంచి కొంత దూరంలో అందమైన ప్రదేశం ఉందని తెలుసుకున్నామని అక్కడికి చేరుకునే ప్రయత్నంలో అడవిలో చిక్కుకుపోయామని బాధితులు చెప్పారు.
అలసట, ఆకలి, దప్పికలతో చాలా సేపు సహాయం కోసం ప్రయత్నించారు. అలా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి పోలీసులను సంప్రదించగలిగారు. అప్రమత్తమైన రెస్క్యూ బృందం అడవిలో గాలింపులు చేపట్టి విద్యార్థులను రక్షించింది. ‘‘ఆలయాన్ని సందర్శించిన తర్వాత గూగుల్ మ్యాప్స్ ద్వారా మేమున్న చోటుకు కొంత దూరంలో అందమైన ప్రదేశం ఉందని తెలుసుకున్నాం. తిరుగుప్రయాణంలో అక్కడికి చేరుకునే ప్రయత్నంలో అడవిలో చిక్కుకుపోయాం’’ బాధితులు పేర్కొన్నారు.
Also Read: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ