Google Gemini AI App: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న గూగుల్ జెన్ఏఐ జెమినిని గూగుల్ విడుదల చేసింది. ఈ జనరేటివ్ ఏఐ చాట్ బాట్ (ChatBot) జెమిని మొబైల్ యాప్ ను ఇంగ్లీషుతో పాటూ మరో 9 భాషల్లో రిలీజ్ చేసింది. హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ చాట్ జీపీటీ పని చేస్తుంది. ఇదొక మొబైల్ యాప్. జెమినీ అడ్వాన్స్ డ్ లో తొమ్మిది స్థానిక భాషలను గూగుల్ అనుసంధానం చేయగలదు. అంతేకాకుండా.. గూగుల్ జెమినీ (Google Gemini) అడ్వాన్డ్స్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. ఇందులో కొత్తగా డేటా విశ్లేషణ సామర్థ్యాలు, ఫైల్ అప్ లోడింగ్, ఇంగ్లీష్ లో గూగుల్ సందేశాలలో జెమినితో చాట్ చేసే అవకాశం వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇందులో కస్టమర్లు దేశంలోని అన్ని భాషల్లో టైప్ చేయవచ్చును. మాట్లాడవచ్చును. దీనిలో మరిన్ని కొత్త ఫీచర్లను తొందరలోనే యాడ్ చేస్తామని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు.
ఐఫోన్ యూజర్లు కూడా..
ఇది గూగుల్ యాప్ అయినా ఐఫోన్ యూజర్లు కూడా వాడుకోవచ్చును. జెమినీ యాప్‌లో దేని గురించి అయినా సెర్చ్ చేయవచ్చును. వాయిస్ లేదా ఫోటో సాయంతో కూడా సెర్చ్ చేయవచ్చును. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే యాక్సెస్ ఉంది. కానీ త్వరలోనే యాపిల్ ఫోన్లలో కూడా అందుబాటులోకి తేనుంది. ఒక వేళ యూజర్లకు మరిన్ని ఎక్కువ ఫీచర్లు కావాలంటే, జెమిని అడ్వాన్స్ ప్రీమియం వెర్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంద గూగుల్ స్పష్టం చేసింది. దీని కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫైల్ అప్‌లోడ్, డేటా అనలైజ్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలిపింది.
డౌన్‌లోడ్ ఇలా..
గూగుల్ ప్లేస్టోర్ నుంచి జెమినీ ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. ఇన్‌స్టాల్ అయిన తర్వాత గూగుల్ కావాలో, జెమినీ కావాలో యూజర్లే ఆప్షన్‌గా పెట్టుకోవాలి.
Also Read:Maharastra: వివాదంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్..అసలేం జరిగింది అంటే?