Sundar Pichai: సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా ? టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 స్మార్ట్‌ఫోన్లను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా డివైజ్‌లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును, అలాగే ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈ ఫోన్లను వాడతానని చెప్పారు. By B Aravind 15 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. రోజులో కొన్నిగంటల పాటు ఫోన్లలోనే మునిగిపోతుంటారు. మరికొందరైతే రెండు, మూడు ఫోన్లను కూడా మెయింటెన్ చేస్తుంటారు. అయితే మరీ టెక్ దిగ్గజం అయిన గూగ్‌ల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా ?. రెండు కాదు మూడు కాదు ఏకంగా 20 స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరి సుందర్ పించాయ్ ఇన్ని ఫోన్లను ఎందుకు వాడుతున్నారనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. Also read: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక కారణం ఇదే అయితే సుందర్ పిచాయ్ 20 స్మార్ట్‌ఫోన్లను ఎందుకు వాడతారంటే.. ఆయా డివైజ్‌లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును టెస్ట్ చేస్తుంటారు. ఇందుకోసం మార్కెట్‌లోకి వచ్చిన 20 స్మార్ట్ మొబైల్స్‌ను కొనుగోలు చేసి.. ఆయా ఫోన్లలో గూగుల్ యాప్స్, వాటి ఉత్పత్తులు ఎలా పనిచేస్తున్నాయి ? ఏదైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. తరచుగా పాస్‌వర్డ్‌లు మార్చడంతో గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుందని.. అందుకోసమే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడటం సురక్షితమైందని సుందర్ పిచాయ్ అన్నారు. ఆ వెబ్‌సైట్‌ను చూస్తా ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో యూజర్లు తమను తాము రక్షించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతిరోజూ నిద్రలేవగానే ఉదయం 'టెక్ మీమ్' అనే వెబ్‌సైట్‌ను చూస్తానని పేర్కొన్నారు. అందులో వచ్చేటటువంటి అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా చదువుతానని.. టెక్ ఇండస్ట్రీపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి వెబ్‌సైట్ అని చెప్పారు. ప్రస్తుతం వెబ్ సెర్చింగ్ విధానం అనేది రోజురోజుకు మారుతూ వస్తుందని.. భవిష్యత్ అవసరాల కోసం దీన్ని మరింద మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు త్వరలోనే జెమిని ఏఐ చాట్‌బాట్‌ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు ఫోన్ స్క్రీన్ టైమ్‌పై అడిగిన ఓ ప్రశ్నకు కూడా ఆయన సమాధానమిచ్చారు. పిల్లల ఫోన్ అడిక్షన్, స్క్రీన్ టైమ్ విషయంలో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమని చెప్పిన ఆయన.. దాని సమయాన్ని కూడా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. Also Read: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం తీర్పు.. అసలు ఈ బాండ్స్ ఏమిటి? #telugu-news #sundar-pichai #smart-phones #google-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి