Google Account: గూగుల్ ఈ ఎకౌంట్స్ తొలగిస్తుంది.. మీది కూడా ఉందేమో చెక్ చేసుకోండి!

గూగుల్ రెండేళ్లుగా లాగిన్ కాకుండా వదిలివేసిన ఎకౌంట్స్ ని డిసెంబర్ 1 నుంచి డిలీట్ చేయబోతోంది. గూగుల్ ఎకౌంట్ తో పాటు.. దానికి లింక్ అయి ఉన్న అన్ని గూగుల్ సర్వీస్ లు అంటే జీ మెయిల్, డ్రైవ్, మీట్ వంటి అన్నిటినీ నిలిపివేస్తామని ప్రకటించింది గూగుల్ 

Google : గూగుల్‌లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్
New Update

Google Account: వచ్చే వారం గూగుల్ ఒక పెద్ద అడుగు వేయబోతోంది, డిసెంబర్ 1 నుంచి  కంపెనీ ఇన్యాక్టివ్ గూగుల్ అకౌంట్లను తొలగిస్తుందని గూగుల్ ప్రకటించింది. ఎకౌంట్  మాత్రమే కాకుండా ఎకౌంట్ తో లింక్ అయి ఉన్న  Gmail, Google ఫోటోలు, Google Drive అలాగే కాంటాక్ట్స్ మొదలైనవి కూడా పూర్తిగా తొలగిస్తారు. కంపెనీ తన ఇన్‌యాక్టివ్ ఖాతా విధానాన్ని డిసెంబర్ 1 నుంచి  అప్‌డేట్ చేయబోతున్నందున ఈ చర్య తీసుకుంటుంది.  Google కొత్త పాలసీ ప్రకారం, ఏదైనా Google ఎకౌంట్  గత రెండేళ్లుగా ఉపయోగించకుంటే లేదా Google ఎకౌంట్ కు  ఎవరూ సైన్ ఇన్ చేయకుంటే, Gmail, Docs, Drive, Meet, Calendar, Google ఫోటోఎకౌంట్ వంటి ఎకౌంట్స్ తీసివేస్తారు. 

ఒకవేళ మీకు ఏదైనా గూగుల్ ఎకౌంట్(Google Account) ఉంటె.. దానిని చాలా కాలంగా అంటే రెండేళ్లుగా ఉపయోగించకుండా ఉంది ఉంటె.. మీ ఎకౌంట్ మిస్ అయిపోయే అవకాశం ఉంది. మీ గూగుల్ ఎకౌంట్ ఇనాక్టివ్ కాకుండా ఉండాలంటే మీరు ఏమి చేయాలో తెలుసుకుందాం. 

Also Read: మ్యూచువల్ ఫండ్స్ పై పెరుగుతున్న మోజు.. ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎలా అంటే.. 

Google ఎకౌంట్ ను ఇలా యాక్టివ్‌గా ఉంచండి

  • మీ Google ఫోటోల ఎకౌంట్ ను యాక్టివ్ గా ఉంచడానికి, మీ ఎకౌంట్ కు  లాగిన్ చేయండి.
  • ఇమెయిల్‌లను పంపడం లేదా  చదవడం చేయండి. 
  • గూగుల్ డ్రైవ్ ఉపయోగించి ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయండి 
  • Google Play Store నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తోంది
  • గూగుల్ సెర్చ్ ఉపయోగించి ఏదైనా ఒక విషయాన్ని సెర్చ్ చేయండి. 
  • Google థర్డ్-పార్టీ యాప్‌లకు సైన్-ఇన్ చేయడం వంటివి చేయండి 
  • వీటిలో ఎదో ఒక పనిని వెంటనే చేయండి. తరువాత కూడా అప్పుడప్పుడు మీ గూగుల్ ఎకౌంట్ లోకి లాగిన్ చేస్తూ ఉండండి. 

అయితే, Google ఈ విధానం స్కూల్ లేదా బిజినెస్ ఎకౌంట్స్ కు వర్తించదు. ఇది మాత్రమే కాదు, ఏదైనా ఎకౌంట్ తొలగించే ముందు Google అనేకసార్లు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

Google ఎకౌంట్ పాస్‌వర్డ్: ఇలా పాస్‌వర్డ్‌ని తిరిగి పొందండి 

మీరు రెండు సంవత్సరాలుగా మీ ఎకౌంట్ కు సైన్ ఇన్ చేయకపోతే- మీ Google ఎకౌంట్  పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, మీరు కొన్ని సాధారణ దశల సహాయంతో పాస్‌వర్డ్‌ను తిరిగి పొందవచ్చు. 

  • ముందుగా మీరు https://accounts.google.com/ కి వెళ్లాలి, 
  • ఆ తర్వాత Gmail IDని నమోదు చేయండి. 
  • Gmail IDని నమోదు చేసిన తర్వాత, Forgot Passwordపై క్లిక్ చేయండి.  మీరు మీ Android ఫోన్ లో Google ఎకౌంట్ సెటప్‌ని కలిగి ఉంటే, Google మీ ఫోన్‌కి నోటిఫికేషన్‌లను పంపుతుంది.  మీరు ఇక్కడ అవును అనే అప్షన్  ఎంచుకోవాలి. దీని తర్వాత మీరు కొత్త పాస్‌వర్డ్‌ను ఈజీగా ఏర్పాటు చేసుకోవచ్చు.

Watch this interesting Video:

#technology #google #google-account
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe