Revanth Sarkar : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఊరూరా ఆరోగ్య పరీక్షలు (Health Tests) చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ రెడీ అయ్యింది. దీని కోసం మొబైల్ ల్యాబ్ (Mobile Lab) లను సిద్దం చేయనుంది. 26 నుంచి 70 సంవత్సరాల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్ , షుగర్ , గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించనుంది.
ఈ పరీక్షల్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లు తెలిస్తే వారికి ఉచితంగా మందులు (Free Medicine) కూడా అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనున్నట్లు సమాచారం.