మీరు 12వ తరగతి ఉత్తీర్ణులై, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటే .. ఇది మీకు గొప్ప అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 20 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.NDA రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఈ పోస్టులకు 9 జనవరి 2024లోపు లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులపై ఉద్యోగం పొందాలనుకునే వారు ఈ విషయాలను జాగ్రత్తగా చదవండి.
వయోపరిమితి:
అవివాహిత పురుష లేదా స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 జూలై 2005కి ముందు.. 1 జూలై 2008 తర్వాత జన్మించి ఉండకూడదు.
అర్హత:
-అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదంటే ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంటర్మిడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
- దీని కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము:
అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. అయితే SC/ST అభ్యర్థులు/మహిళా అభ్యర్థులు/JCO/NCO/OR వార్డులు దరఖాస్తు రుసుము మినహాయించారు. దరఖాస్తు రుసుమును SBI యొక్క ఏదైనా శాఖలో నగదు డిపాజిట్ చేయడం ద్వారా లేదా ఏదైనా వీసా, మాస్టర్ లేదా రూపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా UPIని ఉపయోగించడం ద్వారా చెల్లించవచ్చు.
పూర్తి వివరాల కోసం ఈ అధికారిక వెబ్ సైట్ క్లిక్ చేయండి.