/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T133420.284-jpg.webp)
Job Mela in Vijayawada: విజయవాడ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం స్కిల్ డెవలప్మెంట్ సంస్థ (AP Skill Development Corporation) సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణ ,ఎన్టీయార్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఫిబ్రవరి 21 వ తేదీ అనగా బుధవారం నాడు విజయవాడ లోని ఐటీఐ కళాశాల (ITI College) ఆవరణలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
యువకులను వివిధ ఉద్యోగాల్లో నియమించుకునేందుకు 15 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు. వరుణ్ మోటార్స్, బిజెడ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ జియో, సంతోష్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, మెడ్ ప్లస్, ఆదిత్య ఫార్మసీ, ముత్తూట్ ఫైనాన్స్, హెటెరో, జెన్యూన్ సెక్యూరిటీ సర్వీసెస్, నోవాటెల్, అరబిందో, అయేషా హాస్పిటల్, స్పందన స్ఫూర్తి సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి.
కావున పదో తరగతి, ఐటీఐ, మెకానిక్స్‌లో డిప్లొమా లేదా 18 నుంచి 35 ఏళ్ల మధ్య మరేదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారు రూ. 12,000 నుండి రూ. 25,000 వరకు వేతనం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు www.ncs.gov.in వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 8142416211 మొబైల్ నంబర్‌లో అధికారులను సంప్రదించవచ్చు.