రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో జట్టులోకి రానున్న పంత్ క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ బ్యాట్ పట్టినట్లు తెలిపింది. ఈ యంగ్ ప్లేయర్ గంటకు 144 కిలోమీటర్ల వేగానికి పైగా వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 05 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం కుదుటపడిందా..? ఈ యంగ్ ప్లేయర్‌ను బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తోందా..? గతంలోనే గాయాల భారి నుంచి కోలుకొని నేషనల్ క్రికెట్ అకాడమిలో చేరిన రిషభ్ పంత్ ప్రాక్టీస్ ఎలా ఉంది. మెగా టోర్నీ రానుండటంతో అతన్ని బీసీసీఐ ఎలా సిద్ధం చేస్తోంది..? ఆసియా కప్‌లో రిషభ్ బరిలో దిగబోతున్నాడా..? నేషనల్ క్రికెట్ అకాడమి డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ యంగ్ ప్లేయర్‌ను ఎలా రెడీ చేయబోతున్నారు..? భారత క్రికెట్‌కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిలా పేరు తెచ్చుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పంత్ గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా రిషభ్ పంత్ ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తోన్నట్లు, గంటకు 144 కిలో మీటర్ల వేగంతో వస్తున్న బంతులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. పంత్ ఫిట్‌నెస్ సాధిస్తే త్వరలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. మరోవైపు రిషభ్ పంత్‌ను బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌లా స్టేడియానికి ఇరువైపులా భారీ షాట్లు కొట్టే స్థామర్ద్యం ఉంది. దీంతో అతన్ని స్వదేశంలో జరిగే మెగా టోర్నికి జట్టులోకి తీసుకురావాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అతని బలాన్ని అంచనా వేయాలనే ఉద్దేశంతో వీవీఎస్ లక్ష్మణ్ గంటకు 140 కిలోమీటర్లకుపైగా వేగంతో వస్తున్న బంతులను ఎదుర్కొనేలా తయారు చేస్తున్నారు. పంత్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని తెలియడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లెజెండ్ తిరిగి రావాలని, పంత్ ఇండియన్ టీమ్‌లో చేరితే తిరిగి భారత్ వరల్డ్ కప్ సాధిస్తుందని కొందరు అంటుండగా.. పంత్ భయ్యా ఇప్పుడే బ్యాట్ పట్టవద్దని పూర్తిగా కోలుకోవడానికి సమయం తీసుకోండంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ వచ్చేస్తోంది.. నువ్వు వచ్చేయ్ భాయ్ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా 2022వ సంవత్సరం డిసెంబర్‌లో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ముందే పంత్ కారులో నుంచి బయటకు దూకాడు. ఈ ప్రమాదంలో అతడి మోకాలుకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం రిషభ్ పంత్ ప్రయాణించిన కారు మంటల్లో కాలిపోయింది. పంత్ రోడ్డు పక్కన పడుండటాన్ని గమనించి బస్ డ్రైవర్ అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. #cricket #practice #rishabh-pant #odi-world-cup #national-cricket-academy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి