Ayodhya SpiceJet Special Flight: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్య చేరుకోవడానికి అనేక రకాల సౌకర్యాలకు సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో(Indigo) జనవరి 15 నుంచి ముంబై-అయోధ్య(Mumbai-Ayodhya) మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించనుంది. సోమవారం నుంచి రెండు నగరాల మధ్య నేరుగా రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ విమానం ముంబై నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరి 2:45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అయోధ్య నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5:40 గంటలకు ముంబై చేరుకుంటుంది.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సైస్ జెట్ సర్వీసులు:
అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో స్పైస్ జెట్ (SpiceJet )ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు స్పెషల్ ఫ్లైట్ (Special Flight) సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వారంలో మూడు రోజుల పాటు విమానాలు నడిపేందుకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. టికెట్ల బుకింగ్స్ కూడా షురూ అయ్యాయి. జనవరి 22 తర్వాత నుంచి సామాన్య భక్తులక దర్శనం కల్పించనున్న సంగతి తెలిసిందే. అయితే అయోధ్యకు చేరుకునేందుకు ఎక్కువగా దక్షిణ భారతం నుంచి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రామేశ్వరం, అయోధ్య(Rameswaram, Ayodhya) మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలు కావడంతో పర్యాటకులకు ఎంతో సౌలభ్యం కలగనుంది.
ఫిబ్రవరి 1 నుంచి బెంగుళూరు నుంచి స్పైస్ జెట్ విమానాలు:
బెంగుళూరు నుంచి వచ్చే నెల 1 నుంచి బెంగళూరు-వారణాసి(Bangalore-Varanasi) మధ్య సైస్ జెట్ విమానాలను నడపనుంది. బెంగళూరు నుంచి ఉదయం 10.50 గంటల బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1.30గంటలకు బబత్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 2.10గంటలకు బబత్ పూర్ లో బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు బెంగుళూరుకు చేరుతుంది. మంగళవారం, గురువారం, శనివారంలో ఈ విమానం నడుస్తుందని స్పైస్ జెట్ అధికారులు తెలిపారు.
స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ నుండి అయోధ్య(Delhi to Ayodhya)కు తిరిగి వెళ్లే విమానాలతో పాటు నేరుగా విమానాన్ని కూడా ప్రకటించింది. ఈ విమానం ఢిల్లీ నుంచి అయోధ్యకు గంటన్నరలో ప్రయాణిస్తుంది. ఢిల్లీ నుండి ఈ ప్రత్యేక విమానం (Ayodhya to Delhi Direct Flight Time Table) మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, ప్రత్యేక విమానం (అయోధ్య-ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ టైమ్ టేబుల్) మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు అయోధ్య నుండి బయలుదేరుతుంది. సాయంత్రం 06.30 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది.
ఇండిగో గతంలో అయోధ్యను తమ 86వ దేశీయ గమ్యస్థానంగా ప్రకటించింది. ఫ్లైట్ నంబర్ 6E 2128 డైలీ ఫ్లైట్ నంబర్ 6E 2128 ఢిల్లీ నుండి ఉదయం 11.55 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. ప్రతిగా 6E 2129 విమానం అయోధ్య నుంచి మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి 3 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.