PhonePe Loan: ఫోన్ పే వాడే వారికి శుభవార్త..ఏంటో తెలుసా? ఫోన్ పే వాడే వారికి గుడ్ న్యూస్. ఇప్పటికే లోన్ సర్వీసులు అందిస్తోన్న ఫోన్ పే...తన ఫ్లాట్ ఫామ్స్ లో కన్సూమర్ లెండింగ్ లోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇది జరిగితే ఫోన్ పే కూడా తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్ ఇతర లోన్స్ ఆఫర్ చేస్తుంది. By Bhoomi 27 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PhonePe: ఫోన్ పే వాడుతున్నవారికి శుభవార్త. ప్రముఖ డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్స్ ఫ్లాట్ ఫామ్స్ ఒకటి పేరుగాంచిన ఫోన్ పే తన వినియోగదారులకు బంపర్ న్యూస్ చెప్పింది. ఫోన్ పే తన ఫ్లాట్ ఫామ్స్ లో కన్సూమర్ లెండింగ్ లోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పలు మీడియా నివేదికల ప్రకారం...ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. ఇదే జరిగితే ఫోన్ పే కూడా తన కస్టమర్లకు పర్సనల్ లోన్స్ (Personal Loans), ఇతర కన్సూమర్ లోన్స్ ఆఫర్ చేయనుంది. ఫోన్ పే 2024 జనవరి నాటికి తన ఫ్లాట్ ఫామ్ లో కన్సూమర్ లోన్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ పే (PhonePe) ఐదు లెండర్లతో చర్చలు జరుపుతోంది. తన ఫ్లాట్ ఫాంలో వాటి అనుసంధానానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఐదు లెండర్లలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి. ఫోన్ పే మల్టిపుల్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లోన్స్ ఆఫర్ చేయోచ్చని తెలుస్తోంది. వచ్చే 6 నుంచి 7 నెలల కాలంలో ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఫోన్ పే యూజర్ల సంఖ్య 50 కోట్లపైగా ఉంది. అలాంగే మర్చంట్ల సంఖ్య 3.7 కోట్లుగా ఉంది. అంతేకాదు ఫోన్ పే క్రెడిట్ కార్డు (Phonepe Credit Card) సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీని కోసం ఫోన్ పే ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ తో జత కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు సేవలు అందించనుంది. అంతేకాదు ఫోన్ పే తన కస్టమర్లకు క్రెడిట్ లైన్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే వెంటనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఫోన్ పే లోన్ సర్వీసులను అందిస్తోంది. అయితే కేవలం తన ఫ్లాట్ ఫాం ద్వారా లెండింగ్ సంస్థలను ప్రమోట్ చేస్తోంది. మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఫోన్ పేలో పలు లెండింగ్ సంస్థల లోన్ ఆఫర్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే మీరు దానికి సంబంధించిన లెండింగ్ ఫ్లాట్ ఫాం సైట్లోకి వెళ్తారు. అయితే ఇక నుంచి అలా కాకుండా తన ఫ్లాట్ ఫామ్ ద్వారానే పలు బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా లోన్స్ జారీ చేసే ఛాన్స్ ఉంది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే పేటీఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ లేకపోలేదు. ఇది కూడా చదవండి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్…పౌర సరఫరాల శాఖలో భారీగా ఉద్యోగాలు..పూర్తివివరాలివే.!! #paytm #upi #phonepe #personal-loan #phonepe-loan #bank-loan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి