Gabbar Singh: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్

పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది. పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్ రెడీ అయింది. ఈసారి గబ్బర్ సింగ్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Gabbar Singh: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గబ్బర్ సింగ్ రీ-రిలీజ్
New Update

Gabbar Singh Re Release:పవన్ కల్యాణ్ నుంచి ఇప్పటికే పలు రీ-రిలీజెస్ వచ్చాయి. తొలిప్రేమ, ఖుషి లాంటి సినిమాలు రీ-రిలీజ్‌లో కూడా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు వాటికి మించిన రేంజ్‌లో గబ్బర్ సింగ్ సినిమాను రీ-రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రయిలర్‌ను కట్ చేయిస్తారు. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను కూడా చేయబోతున్నారు.

రీసెంట్‌గా మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా బిజినెస్ మేన్ సినిమాను రీ-రిలీజ్ చేశారు. సెకెండ్ రిలీజ్‌లో కూడా సినిమా సంచలనం సృష్టించింది. మొదటి రోజు ఏకంగా ఐదున్నర కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఇప్పుడీ రికార్డ్‌ను గబ్బర్ సింగ్‌తో అధిగమించాలని పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది గబ్బర్ సింగ్ సినిమా.. హిందీలో హిట్టయిన దబంగ్ సినిమాకు రీమేక్ ఇది. అప్పటికే వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టింది గబ్బర్ సింగ్ సినిమా.

Also Read: భోళాశంకర్ మొదటి రోజు రికవరీ ఎంత..?

#pawan-kalyan #gabbar-singh-movie-re-release #pawan-kalyans-gabbar-singh-re-release #gabbar-singh-re-release #september-2 #re-release-of-gabbar-singh-movie #birthday
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe