TS News: రైతన్నలకు గుడ్ న్యూస్...రుణమాఫీపై సర్కార్ కీలక నిర్ణయం..!!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రైతులకు ఇచ్చినరూ. 2లక్షల రుణమాఫిపై కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.

Rythu Barosa: ఎకరాకు రూ.7500.. ఎప్పుడంటే!
New Update

TS News:  తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఎంతో క్రుషి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..తాజాగా రైతు రుణమాఫీ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఇచ్చిన రూ. 2లక్షల రుణమాఫీ హామీని నెరవేర్చేలా కార్యచరణను రెడీ చేస్తోంది. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీల్లో ఒకటిగా ఉంది. ఇది అమలు చేయకుంటే రైతులు తీవ్ర ఆగ్రహానికి గురికాక తప్పుదు. అందుకే వీలైనంత తొందరగా రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.

రైతులకు ఇచ్చిన రూ. 2లక్షల రుణమాఫీ హామీపై ఎంతోమంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈమధ్య జరిగిన బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క దీనిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రైతు రుణమాఫీ అమలు త్వరలోనే జరుగుతుందన్న హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరెడ్డి కూడా రైతు రుణమాఫీపై కీలక విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన మాటపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుతం అధికారులు రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారన్నారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించగానే..రుణమాఫీ అమలు జరుగుతుందన్నారు.

ఇక తెలంగాణ సర్కార్ ఆరు గ్యారంటీల అమలుపై కార్యచరణ రెడీ చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సులతోపాటు ఆరోగ్యశ్రీ లిమిట్ 10లక్షలకు పెంచిన రేవంత్ రెడ్డి సర్కార్..ఇఫ్పుడు మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేసి ముందుకెళ్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా తీరుస్తున్న ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తోంది. తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్షమంటోంది. ప్రజాపాలనలో స్వీకరించిన ఐదు గ్యారెంటీల అప్లికేషన్స్ కు సంబంధించిన డేటా ఎంట్రీ కూడా పూర్తి అయ్యింది. ఆధార్, రేషన్ కార్డులను క్రోడీకరించి దరఖాస్తులోని సమాచారాన్ని పోల్చీ చూశారు. ఇప్పుడు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ అయ్యింది.

ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా…ఈ ఆఫర్ కొద్దిరోజులే..!!

#rythu-runa-mafi #telanagna #key-decision #government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి