Rythu Bharosa : తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్...రైతు భరోసా నిధులు రిలీజ్..ఇవాళ్టి నుంచి అకౌంట్లో జమ..!! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు. By Bhoomi 12 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Farmers Rythu Bharosa : తెలంగాణలో 72లక్షల మంది రైతు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శుభవార్త చెప్పారు. యాసంగి కోసం విత్తనాలు, ఎరువులుకొనుగోలుచేసేందుకు రైతు బంధు నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈపథకానికి కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా(Rythu Bharosa) అని పేరు పెట్టింది. పేరు ఏదైనా సరే..నిధులు రావడం ముఖ్యం. అయితే నేటి నుంచిరైతులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకే నేటి నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు జవ అవుతుంది. అందరికీ ఒకేరోజు జమ కాకపోవచ్చు. అందుకే రైతులకు తమకు డబ్బు వచ్చిందో లేదో అకౌంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇకతెలంగాణలో మొత్తం 72లక్షల రైతు కుటుంబాలకు ఈ డబ్బు ఇస్తోంది సర్కార్. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో పెద్దగా డబ్బు లేనప్పటికీ...రైతులకు ఆలస్యం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉన్న డబ్బును రైతుల అకౌంట్లో జమ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోజువారీ వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రైతు భరోసాకి కేటాయిస్తూ..రైతుల అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. అంతేకాదు ప్రతీరూపాయికీ లెక్క తప్పనిసరిగా ఉండాలనీ..అవకతవకలకు పాల్పడితే..కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారులను హెచ్చరించారు. అందువల్ల జిల్లాల్లోని ట్రెజరీలకు కొన్ని మార్గదర్శకాలనుకూడా విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రూపొందించలేదు. అందుకే ప్రస్తుతానికి రైతు బంధు పథకం ప్రకారం...రైతుల ఖాతాల్లో రూ. 5వేల చొప్పున వేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించిన తర్వాత ఆ పథకం ప్రకారం డబ్బు సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు. కానీ ఏ రైతుకైనా డబ్బు రాకపోతే మత్రం ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. అందుకే రైతులందరికీ డబ్బు జమ అవుతోంది. డబ్బు అకౌంట్లో జమ కానివారు స్ధానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులను ప్రశ్నించవచ్చుని తెలిపారు. అటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల చొప్పున రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం రుణమాఫీ కోసం కార్యాచరణసిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే జాతీయ, గ్రామీణ, షెడ్యూల్ బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న రైతు కుటుంబాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించనుంది. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్! #telangana #cm-revanth-reddy #farmers #rythu-bharosa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి