JNTUH: ఇంజనీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూ అదిరిపోయే శుభవార్త.. కీలక ఉత్తర్వులు జారీ! జేఎన్ టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరంలో డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు 23, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 గ్రేస్ మార్కులు కలపబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 17 Dec 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. Grace Marks official Notification. 30 marks for regular 23 for Lateral Entry students . These orders shall come into force with immediate effect for the students of JNTUH University Colleges, JNTUH Affiliated and Affiliated Autonomous Colleges pic.twitter.com/jQw0rEPNIE — Jntuh Updates (@examupdt) December 16, 2023 ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం.. డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థులకు 23 మార్కులు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కానీ వాళ్లకు 30 మార్కులు కలపబోతున్నట్లు తెలిపారు. గంలోనూ కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, ఈసారి కూడా విద్యార్థుల విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అలాగే ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్‌లతో చర్చింని తర్వాత దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నామని, తక్షణమే ఇది ఆచరణలోకి వస్తుందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఉద్యోగాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, డిగ్రీ పర్సంటేజీలకు సంబంధించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సడలింపు ఇవ్వబడిందని స్పష్టం చేశారు. సబ్జెక్ట్ మినహాయింపు ఎందుకు ఇవ్వలేదో వివరిస్తూ ఒక సబ్జెక్ట్ మినహాయింపు ఇస్తే, మెమోలో ‘క్లియర్ చేయని సబ్జెక్ట్‌లు’ అని స్పష్టంగా పేర్కొనబడుతుందని అన్నారు. ఇది కూడా చదవండి : పిత్తాశయంలో రాళ్లు.. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా.. అసలేమైందంటే? అయితే గ్రేస్ మార్కులు పెంచుతూ యూనివర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక నవంబర్ 20వ తేదీన విద్యార్థులు క్రెడిట్ ఆధారిత నిర్బంధ విధానాన్ని సడలించాలని కోరుతూ క్యాంపస్‌లో ధర్నాకు దిగారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) విద్యార్థి విభాగం, యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తెలంగాణ నుంచి విద్యార్థులకు మద్దతు లభించింది. అయితే తాజాగా యూనివర్సీటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన NSUI తెలంగాణ ప్రెసిడెంట్ వెంకట్ బల్మూర్ ‘JNTUH వైస్ ఛాన్సలర్‌తో సమావేశం జరిగింది. సబ్జెక్ట్, క్రెడిట్ మినహాయింపు కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు ఇస్తామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు. JNTU తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ట్విట్టర్ వేదికగా విషయాన్ని షేర్ చేశారు. #jntu #grace-marks #engineering-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి