Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో..

బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపుగా 1000 రూ. వరకూ పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేల దగ్గర వరకూ పలుకుతోంది. ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750  ఉండగా..24 క్యారెట్లు 69530రూ. వద్ద కొనసాగుతోంది.

New Update
Gold Rates : 70వేల మార్క్‌ను దాటేసింది.. ధగధగ బంగారం.. భగభగ

Gold Price Today:మహిళలకు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ఈరోజు బంగారం  10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750  ఉండగా..24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.69530 వద్ద కొనసాగుతోంది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 850, రూ. 930 పెరిగింది. నిన్నటితోపోల్చితే దాదాపు రూ. 1000 ఎగబాకింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. వెండికూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండి రూ. 1,120 మేర పెరిగింది ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 78,570కి చేరింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి దగ్గరగా ఉండటంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకాయి. ఇది బులియన్ ధరల పెరుగుదలకు ఊపందుకుంది. "అదనంగా, బలమైన చైనీస్ డిమాండ్ కూడా విలువైన మెటల్ ధరలను పెంచుతోంది" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు.ఇదిలా ఉండగా, MCXలో ఫ్యూచర్స్ ట్రేడ్‌లో, జూన్ కాంట్రాక్ట్ బంగారం 10 గ్రాములకు రూ.978 పెరిగి రూ.68,679కి చేరుకుంది. మే నెల కాంట్రాక్టు వెండి కిలో రూ.763 పెరిగి రూ.75,811కి చేరుకుంది.

విదేశీ మార్కెట్లలో, స్పాట్ COMEX బంగారం ధరలు ఔన్స్‌కు USD 2,265.73 వరకు పెరిగాయి మరియు చివరిగా ఔన్సుకు USD 2,257.10 వద్ద కోట్ అయ్యింది. బంగారం ఓవర్సీస్ ఫ్యూచర్స్‌లో ఔన్సుకు USD 2,280, MCX ఫ్యూచర్స్‌లో 10 గ్రాములకు రూ. 69,487 కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో పెరిగింది. అంచనా వేసిన అమెరికా వృద్ధి డేటా కంటే మెరుగైనది. 2.5 శాతం కంటే ఎక్కువ ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా అంచనా రేటు తగ్గింపుపై ఆందోళనలు తలెత్తాయి. ఈస్టర్ సెలవుదినం కోసం ఈ రోజు చాలా మార్కెట్లు మూసినందున డాలర్ ఇండెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది" అని JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని EBG - కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.!

Advertisment
తాజా కథనాలు