Gold Rate Today: పండగలు వస్తున్నాయి...వెళుతున్నాయి కానీ బంగారం రేటు మాత్రం స్థిరంగా ఉంది. కొనాలంటే భయం వేసే రేంజ్ లో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. హైదరాబాద్ (Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 57,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,400 గా ఉంది. కిలో వెండి (Silver) ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,500 గా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 57,200 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 62,400 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 78,500 గా ఉంది.
Also Read:జిల్లాల వారీగా డీఎస్సీకి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..!!
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు జరిగే పరిణామాల బట్టి ఈ ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.