/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-News-jpg.webp)
Gold Rates Today : పసిడి ధరలు(Gold Rates) పెరుగులు పెడుతున్నాయి. అదే బాటలో వెండి ధరలు(Silver Price) చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజు భారీగా ధరలు పెరుగుతున్న ధరలను సామాన్యులు ఇంక బంగారం కొనలేమో అనే పరిస్థితి నెలకింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(Multi Commodity Exchange) లో బుధవారం బంగారం ధర తులానికి రూ. 440 పెరిగింది. ఏప్రిల్ ఫ్యూచర్ లో బంగారం జీవిత కాల గరిష్ట స్థాయి ర. 69,487 కుచేరింది. కిందటి సెషన్ ముగింపు ధరతో పోల్చితే 0.64శాతం పెరిగి రూ. 69,369 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో ఎంసీఎక్స్(MCX) లో సిల్వర్ ధరలు కూడా ఏకకాలంలో రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కిలోకు రూ. 77.957కు పెరిగింది. డాలర్ ఇండెక్స్ క్షీణించడంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గిడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
డాలర్ ఇండెక్స్(Dollar Index) ప్రస్తుతం 104 మార్క్‌కు ఎగువన కొనసాగుతోంది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్‌కి 2,308 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరగా... మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా బంగారం సానుకూలంగా ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లలోని ధరల పెరుగుదల దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నది. బులియన్ మార్కెట్‌లో బుధవారం 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.750 పెరిగింది. తులానికి రూ.64,100కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.760 పెరిగి తులం రూ.69,870కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర సైతం భారీగానే పెరిగింది. కిలోకు ఏకంగా రూ.2వేలు పెరిగింది. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలను చూస్తే...ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.64,250 ఉంది. 24 క్యారెట్ల పసిడి రూ.70,020కి పెరగగా.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.65వేలు ఉంది. 24 క్యారెట్ల స్వర్ణం రూ.70,910కి చేరింది.ముంబయి నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.64,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.69,870వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: మోదీని మూడోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా బుల్లెట్ రాణి దేశవ్యాప్త పర్యటన..!