Gold Rate Today : కొనాలంటే మంచి ఛాన్సే.. ఈరోజు బంగారం-వెండి ధరలివే!

బంగారం ధరలు వరుసగా రెండోరోజూ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద నిలకడగా ఉన్నాయి.  ఇక వెండి ధర రూ.78,000 వద్ద మార్పులు లేకుండా ఉంది.

New Update
Gold Rate Today: మార్పులు లేని బంగారం.. వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే.. 

Gold Rate Today : బంగారం(Gold) కొనాలని అనుకునే వారిని ఎప్పటికప్పుడు ధరల మార్పుతో టెన్షన్ పెడుతుంది. క్రితం వారం మొత్తం పైకీ కిందికి కదలాడిన బంగారం ధరలు వారం మొత్తంగా చూసుకుంటే దాదాపు స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. మధ్యలో కాస్త పెరిగినట్టు కనిపించినా మొత్తంగా చూసుకుంటే పెద్దగా ధరల్లో మార్పు లేదు. ఈరోజు అదే ధోరణిలో బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండడం.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. దీంతో ఈరోజు అంటే జనవరి 29న  నిలకడగా ఉన్నాయి. బంగారం ధరల(Gold Rate Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిలకడగా ఉండడం  .. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా  ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 29న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Today) స్థిరంగా ఉంది.  దీంతో  దేశీయంగా బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి.  మరోవైపు వరుసగా పెరుగుతూ షాక్ ఇచ్చిన వెండి ధరలు కూడా బంగారం బాటలోనే స్థిరంగా ఉన్నాయి.  ఈరోజు అంటే సోమవారం (జనవరి 29) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.              

హైదరాబాద్ లో బంగారం ధరలు :
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) రూ.57,800ల వద్ద నిలిచింది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకుమార్పులు లేకుండా  రూ. 63,050ల వద్ద ఉంది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) స్థిరంగా ఉన్నాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold rate in India) మార్పులేకుండా 10 గ్రాములకు రూ.57,950ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగా రూ.63,200ల వద్దనిలిచింది. 

Also Read : తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి!

వెండి ధరలు ఇలా :
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold rate in India) నిలకడగా ఉంటె.. వెండి ధరలు కూడా ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి.   హైదరాబాద్ లో వెండి కేజీ రూ.78,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర రూ. 76,500 ల వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగానూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate in India) 2019డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 22.81 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు