Gold Rate Today : నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు తగ్గుదల కనబరిచాయి. అంతకు ముందు వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. మరికాస్త తగ్గి బంగారం కొనాలని అనుకునే వారికి మంచి ఛాన్స్ అనిపించేలా చేస్తున్నాయి. బంగారం ధరలు తగ్గుతుండడంతో కొనడానికి ఇదే మంచి సమయం అని అందరూ భావిస్తున్నారు. బంగారం, వెండి ధరలు(Gold Rate Today) నిలకడగా ఉండేవి కావు.. అలానే ఇంకా తగ్గుతాయి అని కచ్చితంగా చెప్పేలా కూడా ఉండవు. ప్రస్తుతం అయితే, బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయి. వెండి కూడా ప్రతి రోజూ తగ్గుతూనే వస్తోంది. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ తగ్గుతూ రావడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తమ్మీద బంగారం ధరలు(Gold Rate Today) తగ్గుముఖం పట్టడం అనేది సామాన్యులకు కాస్త ఊరట ఇచ్చే అంశమని చెప్పవచ్చు. మరోవైపు రెండురోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి. ఈరోజు అంటే మంగళవారం (ఫిబ్రవరి 06) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate Today: బంగారం కొంటారా? రేటు తగ్గింది.. వెండి కూడా తగ్గింది.. ఎంతంటే..
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,950ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,220ల వద్దకు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 300 తగ్గి రూ.76,700 వద్ద ఉంది.
Translate this News: