Gold Rates : అయోధ్య(Ayodhya) లో బాల రాముడు(Ram Lalla) ఈరోజు కొలువుతీరనున్నాడు. అందుకేనేమో.. బంగారం ధరలు(Gold Rates) ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం.. దేశీయంగానూ ప్రభావం చూపిస్తోంది. అంతకు ముందు వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు ఈరోజు అంటే జనవరి 22న నిలకడగా నిలిచాయి. బంగారం ధరల(Gold and Silver) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం.. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే జనవరి 22న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర (Gold Rate Today)స్వల్పంగా తగ్గాయి. దీంతో దేశీయం గాను బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఇక్కడ కూడా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే స్థిరంగా ఉన్నాయి. ఈరోజు అంటే సోమవారం (జనవరి 22) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold and Silver) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold Rate Today : బాల రాముడు కొలువయ్యే వేళ.. బంగారం ధరలు ఎలా వున్నాయంటే..
వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,050ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర రూ.77,000 వద్ద మార్పులు లేకుండా ఉంది.
Translate this News: