Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి. గత కొన్నిరోజులు తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు..నేడు కూడా భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 53,900గా ఉంది. 24 క్యారెట్ల (24 carat gold) పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. గురువారంతో పోల్చితే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 600తగ్గింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం పై రూ. 650 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈ రోజు నమోదు అయినవి. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ (Hyderabad), విజయవాడలో బంగారం ధరలు:
హైదరాబాద్ లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900 ఉండగా...24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,800గా ఉంది.
ఇది కూడా చదవండి: ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..!!
దేశ రాజధాని ఢిల్లీలో...
10 గ్రాముల పసిడి(10 Gram Gold) ధర రూ.54,050
24 క్యారెట్ల బంగారం ధర రూ.58,950.
ముంబైలో..
22 క్యారెట్ల పసిడి రూ.53,900
24 క్యారెట్ల బంగారం రూ.58,950
చెన్నైలో..
22 క్యారెట్ల బంగారం ధర రూ.54,100
24 క్యారెట్ల ధర రూ.59,020
కేరళలో ..
22 క్యారెట్ల ధర రూ.53,900
24 క్యారెట్లు రూ.58,800
బెంగళూరులో..
22 క్యారెట్ల ధర రూ.53,900
24 క్యారెట్ల ధర రూ.58,800
కోల్‌కతాలో..
22 క్యారెట్ల ధర రూ.53,900
24 క్యారెట్ల పసిడి ధర రూ.58,800
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు..ఎప్పటివరకు పూర్తవుతుందంటే..!!
అటు వెండి (Silver) ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 73,700గా ఉండగా...నిన్నటితో పోల్చినట్లయితే..వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి, 73,700లు, చెన్నైలో 76,500, బెంగళూరులో 73,000, హైదరాబాద్ లో రూ. 76,500 పలుకుతోంది. ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు ఇంత తగ్గడం ఇదే మొదటిసారి.