Gold Rates Today : బంగారం ధరలు వరుసగా రెండురోజులు తగ్గినట్టు తగ్గి ఆశలు రేపాయి. దీంతో బంగారం కొనాలని అనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు కాస్త పెరుగుదల కనపరిచాయి. దీంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. ముందు వారంలో తగ్గుతూ..పెరుగుతూ కదలాడినా వారాంతానికి స్థిరంగా బంగారం ధరలు నిలిచాయి. కానీ, ఈవారం బంగారం ధరలు రెండురోజులు తగ్గుతూ వచ్చాయి. అయితే, ఈరోజు అంటే ఫిబ్రవరి 08న బంగారం పెరుగుదల కనబరిచింది. బంగారం ధరల(Gold Price Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా బంగారం డిమాండ్ ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 8న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Today) స్వల్పంగా పెరిగింది. దీంతో దేశీయంగాను బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు వరుసగా రెండోరోజూ భారీగా పడిపోయాయి. ఈరోజు అంటే గురువారం (ఫిబ్రవరి 8) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price Today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Price Today) 260 రూపాయలు పెరిగింది. దీంతో రూ.58,010ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు260 రూపాయలు పెరిగి రూ. 63,240ల కు చేరుకుంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Today) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 260 రూపాయలు పెరిగి 10 గ్రాములకు రూ.58,160ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 190రూపాయలు పెరుగుదల కనబరిచి రూ.63,340ల వద్దకు చేరుకుంది.
Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Price Today) పెరుగుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీ తగ్గుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 1000 రూపాయలు తగ్గి రూ.73,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 1000రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,000లకు చేరుకుంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Today Gold Price) 2039డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Gold and Silver) ఔన్స్ 23.31 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.
Watch this Interesting News :