Gold Prices Downfall : దేశ వ్యాప్తంగా పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి(Sankranti) ముందు పసిడి ప్రియులకు ఓ గుడ్ న్యూస్. బంగారం ధరలు(Gold Price) నిన్నటి ధరలతో పోలిస్తే శుక్రవారం నాడు ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 100 కిందకి దిగి వచ్చింది. దీంతో నేటి మార్కెట్లో బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 600 కి చేరింది.
వెండి ధరలు మాత్రం..
ఈ క్రమంలోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 తగ్గి రూ. 62, 830 వద్ద స్థిరపడింది. బంగారం ధరలు ఇలా ఉండగా వెండి ధరలు(Silver Price) మాత్రం అలాగే ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 76,000 వద్ద స్థిరంగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర . రూ. 58,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,380 గా ఉంది.
విజయవాడలో కూడా..
పూణె(Pune) లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర . రూ. 62,830 గా ఉంది. హైదరాబాద్(Hyderabad) లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62, 830 గా కొనసాగుతుంది. విజయవాడలో కూడా ఇవే రేట్లు ప్రస్తుతం ఉన్నాయి.
హైదరాబాద్ లో కేజీ వెండి..
వెండి ధరలు శుక్రవారం నాడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 7,600 లుగా ఉంది. కేజీ వెండి ధర 76 వేల రూపాయాలకు చేరుకుంది. గురువారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 77,500 గా ఉండగా, కోల్ కతా(Kolkata) లో రూ.76 , 000 ఉండగా, బెంగళూరులో రూ. 73,500 గా ఉంది.
ఏది ఏమైనప్పటికీ పండుగ ముందు బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా పండుగ తరువాత భారీగా వివాహ ముహుర్తాలు కూడా ఉండడంతో బంగారం కొనేందుకు ప్రజలు బంగారం షాపులకు క్యూ కడుతున్నారు.
Also read: కెమెరా ముందుకు అల్లు అర్జున్ భార్య.. అయితే సినిమాలో కాదు!