Gold Price: భారీగా తగ్గిన బంగారం..వెండి ధరలు! ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే గురువారం నాడు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై సుమారు 350 రూపాయలు తగ్గి రూ. 57,700 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి ..రూ . 62, 950 కి చేరుకుంది. By Bhavana 18 Jan 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. నిన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా ఆగిపోయాయి. బుధవారం ధరలతో పోల్చుకుంటే..గురువారం నాడు బంగారం ధరలు (Gold Prices) భారీగా తగ్గాయని తెలుస్తుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై సుమారు 350 రూపాయలు తగ్గి రూ. 57,700 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి ..రూ . 62, 950 కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. వెండి (Silver Price) కిలో పై 600 రూపాయలు తగ్గి..రూ. 75,900 కి చేరుకుంది. ధరలు భారీగా దిగి వచ్చిన తరువాత ప్రధాన నగరాల్లో బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..! ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో (Delhi) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,850 లుగా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100 గా ఉంది. కోల్‌కతాలో అయితే 22 క్యారెట్ల బంగారం రూ.57,700 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 62, 950 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళల్లో కూడా ఇవే రేట్లుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 22 క్యారెట్లు అయితే రూ. 57,700 గా..24 క్యారెట్ల బంగారం రూ. 62, 950 గా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,100 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,380 గా నమోదు అయ్యాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. రూ.600 తగ్గి..రూ.75,900 కి చేరుకున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో కేజీ వెండి ధర రూ.77,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ.75,900 ఉండగా..బెంళూరులో రూ.73,750 గా ఉంది. Also Read: ”ఆత్మ రక్షణ కోసమే ”.. పాక్ పై దాడుల గురించి స్పందించిన భారత్! #gold-price-today #gold-prices #silver #gold-price-today-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి