Gold And Silver Rates : బంగారం(Gold) ఇంక కొనలేమా అంటూ భయపడుతున్నారు పసిడి ప్రియులు. రోజు రోజుకూ వీటి ధరలు పెరుగుతుంటే ఎలా కొనలా అని బెంబేలెత్తుతున్నారు. వారం, పది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎక్కడ ఆగుతాయో కూడా తెలియడం లేదు. పెళ్లిళ్ల సీజన్(Wedding Season) కు తోడు, జూన్‌లో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని ఊహాగానాల నేపథ్యంలో బంగారం ధర గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. బంగారంతో పాటూ వెండి కూడా కొండెక్కి కూర్చుంటోంది.
పెరిగిన ధరలను బట్టి హైదరాబాద్(Hyderabad) మార్కెట్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,605 ఉండగా..10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,006 ఉంది. ఇక వెండి ధర(Silver Rate) విషయానికి వస్తే కిలో సిల్వర్ ధర రూ. 78,200 ఉంది.కిలో వెండిపై నిన్న రూ. 1200 పెరిగగా.. గడిచిన వారం రోజుల్లో కిలో వెండిపై రూ. 2,800 పెరుగుదల చోటు చేసుకుంది. ఇక బంగారం అయితే నిన్నటికి ఇవాల్టికి రూ.700 పెరిగిపోయింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి ఇవాళ రూ. 59 వేల 600 మార్క్ చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు(Gold Rate) రూ. 760 పెరిగి రికార్డు గరిష్ఠం రూ. 65 వేలు తాకింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 2,152 డాలర్లకు చేరుకుంది. దాంతో పాటూ సిల్వర్ రేటు కూడా పరుగెడుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.69 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇక బులియన్ మార్కెట్లో దేశీయ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్(Sensex) 97 పాయింట్ల నష్టంతో 73,579 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ అయితే 39 పాయింట్లు నష్టపోయి 22,317 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90 దగ్గర మొదలైంది.
Also Read : National : నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం