Independence Day celebrations: స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట..

హైదరాబాద్‌ నగరం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గోల్గొండ కోటలో జరుగనున్న ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పోలీసులు ఇప్పటికే పూర్తి చేశారు.

Independence Day celebrations: స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట..
New Update

హైదరాబాద్‌ నగరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మంగళవారం నగరంలోని గోల్కొండ కోట వద్ద సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తర్వాత అక్కడ జరిగే పోలీసుల కవాతులో పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో పోలీసులు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. ఇందులో భాగంగా రాణి మహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకు వెళ్లే రోడ్డును మూసివేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పలు రూట్లకు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నట్లు అధికారులు వివరించారు.

గోల్కొండలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యే వారికి పోలీస్‌ అధికారులు పలు సూచనలు చేశారు. వారు ప్రయాణించాల్సిన మార్గాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. వీఐపీలకు గోల్డ్‌ (ఏ), పింక్‌ (ఎ), బ్లూ (బి), గ్రీన్‌ (సి), రెడ్‌ (డి), బ్లాక్‌ (ఇ)గా పలు రకాల పాసులను ఇవ్వనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే వారికి గోల్డ్ (ఏ), పింక్ (ఏ), బ్లూ (బి) పాసులు అందించబోతున్నట్లు, వారిని గోల్కొండ కోట వరకు అనుమతించనున్నట్లు వెల్లడించారు. అందులో గోల్డ్ (ఎ) పాసులు ఉన్న వాహనదారులు తమ వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద పార్కింగ్ చేసుకోవాలని, పింక్ (ఎ) పాసులు ఉన్న వారు గోల్కొండ బస్టాప్‌ వద్ద పార్కింగ్‌ చేయాలని, బ్లూ (బి) పాస్‌లు పొందిన వారు సమీపంలో ఉన్న ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో పార్క్‌ చేసుకోవాలని సూచించారు.

మరోవైపు గ్రీన్‌ (సి) పాస్‌లు ఉన్న వీఐపీలు తమ వాహనాలను జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేసుకోవాలని, బ్లాక్‌ (ఇ) పాస్‌లు పొందిన వారు తమ వాహనాలను ఫతేదర్వాజా వైపు వెళ్లి హుడా పార్క్ వద్ద పార్కింగ్ చేయాలని, షేక్ పేట, టొలిచౌకి నుంచి వచ్చే సామాన్యులు తమ వాహనాలను సెవెన్ టూంబ్స్ లోపల పార్క్ చేయాలని అధికారులు సూచించారు. కాగా ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపిన పోలీసులు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే నగరంలో సైతం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వింధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

#police #cm-kcr #traffic-restrictions #golconda-fort #freedom-fighters #passes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe