Gmail - Google : నేటికాలంలో జీమెయిల్ తప్పనిసరి. స్మార్ట్ ఫోన్(Smart Phone), ల్యాప్ టాప్, కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ ఉండాల్సిందే. మనం స్మార్ట్ ఫోన్ వాడాలంటే తప్పనిసరిగా జీమెయిల్ అవసరం. అది లేకుండా మన ఫోన్ ఓపెన్ కాదు. అందులోనూ ఎక్కువ మంది జీమెయిల్(Gmail) ను వాడుతుంటారు. వీటిలో మనకు తెలియకుండానే మెయిల్స్ వస్తాయి. దీంతో గూగుల్ ఇచ్చిన జీమెయిల్ 15జీబీ ఫ్రీ లిమిట్ ఫుల్ అవుతుంది. అప్పుడు ఇన్ బాక్సులో ఉండే మెయిల్ ఏవి ముఖ్యమో..ఏవి అనవసరమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే దీనికో పరిష్కారం ఉంది. దాని కోసం మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే నిమిషాల్లో మెయిల్స్ ను డిలీట్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
కొందరి జీమెయిల్స్ లో వేల సంఖ్యల మెయిల్స్ ఉండలం వల్ల వాటిని డిలీట్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. జీమెయిల్స్ లో ఒకసారి 50 కంటే ఎక్కువ మెయిల్స్ సెలెక్ట్ చేయడం కష్టం. అయితే ఓ ఫీచర్ ద్వారా వీటిని ఓకేసారి డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది. సాధారణంగా మనకు వచ్చే అనవసరమైన మెయిల్స్ ను మనం పట్టించుకోము. నోటిఫికేషన్ వస్తే వాటిని స్కిప్ చేస్తుంటాం. అలా చదవని మెయిల్స్ డిలీట్ చేసుకునే ఆప్షన్ జీమెయిల్ లో ఉంది.
ఎలాగంటే:
-మీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ల్యాప్ టాప్ లో కానీ జీమెయిల్ ఓపెన్ చేయండి.
- అందులో సెర్చ్ ఆప్షన్ లో అన్ రీడ్ అని టైప్ చేయండి.
-ఇప్పుడు పైన కనిపించే టిక్ బాక్సును సెలక్ట్ చేయండి. అక్కడ కనిపించే 50 మెయిల్స్ ను సెలక్ట్ చేసుకోవచ్చు.
-దాని పక్కనే ‘select all conversations that match this search’ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకోండి.
-మీ మెయిల్స్ బాక్సులో మీరు చదవని మెయిల్స్ అన్నీ సెలక్ట్ చేసుకోండి.
- పైన కనిపించే డిలీట్ పై క్లిక్ చేయండి. ఒకేసారి డిలీట్ చేసుకోండి.
- అవన్నీ ట్రాష్ లోకి వెళ్తాయి. 30 రోజుల తర్వాత అవన్నీ కూడా ఆటోమెటిగ్గా డిలీట్ అవుతాయి. అవసరం లేదనుకుంటే వెంటనే డిలీట్ చేసుకోవచ్చు.
Also Read : Smartphones : పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారా ? పరిశోధకుల హెచ్చరిక..!
పెద్ద ఫైల్స్ ఒకసారి ఎలా చేయాలి?
జీమెయిల్లో వచ్చే పెద్ద ఫైల్స్ , వీడియోలతో గూగులో అకౌంట్ స్టోరేజీ నిండిపోతుంది. పెద్ద ఫైల్స్ ను కూడా ఒకేసారి డిలీట్ చేయవచ్చు. ఒక్కో మెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ చేసే పని లేకుండా జీమెయిల్ సెర్చ్ బార్ లో Size : 25M అని టైప్ చేయండి.
-తర్వాత మీరు సెలక్ట్ చేసుకున్న సైజులో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పైకి వస్తాయి.
-వాటిలో మీకు అవసరం లేని ఫైల్స్ డిలీట్ చేయవచ్చు.
-మీ జీమెయిల్లో ఏళ్ల నుంచి పేరుకుపోయిన పాత మెయిల్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. వాటిని డిలీట్ చేయాలంటే ...జీమెయిల్ సెర్చ్ బార్ లో older_than : 3y అని టైప్ చేస్తే మీకు మూడేళ్ల క్రితం మెయిల్స్ కూడా వస్తాయి. అందులో మీకు అవసరం లేని మెయిల్స్ సెలక్ట్ చేసుకుని డిలీట్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!!