/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-10-5-jpg.webp)
Kalki 2898 AD : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్ ల భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదరుచూస్తున్న అభిమానులకోసం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు(Amitabh Bachchan) సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు.
Here's the awaited glimpse of #Kalki2898AD#Prabhas #AmitabhBachchan pic.twitter.com/E70ABars5J
— Shreyas Media (@shreyasgroup) April 21, 2024
Also Read : ఆ సినిమా నాకు గొప్ప గుణపాఠం నేర్పింది!
నీవు ఎవరూ దేవుడివా?
ఈ మేరకు ఓ బాలుడు నీవు ఎవరూ దేవుడివా? నీకు మరణం లేదా? అంటూ ప్రశ్నించగా.. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామనంటూ అమితాబ్ తనని తాను పరిచయం చేసుకునే దృశ్యాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అంతేకాదు ఇందులో ఆయన యంగ్ లుక్‌లోనూ కనిపించడం విశేషం. కాగా ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్(Deepika Padukone)గా నటిస్తుండగా.. కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక మే 9న విడుదల కావాల్సిన సినిమా.. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) కారణంగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.