Hanging From Building: చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ కార్మికులు గాలిలో తేలియాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు కనిపిస్తుంది.
ఇందులో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్న కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనిపిస్తుంది. నివేదికల ప్రకారం, “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం బీజింగ్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది.
ఫెంగ్ టై జిల్లాలోని కియాన్‌లింగ్ షాన్ పర్వతం వద్ద గాలి వేగం సెకనుకు 37.2 మీటర్లకు చేరుకుంది. ఇది టైఫూన్ బలానికి సమానమని వాతావరణ అధికారులు తెలిపారు. గాలి తుఫాను తర్వాత, కొమ్మలు, అక్కడక్కడ వాహనాలు పడిపోయినట్లు సమాచారం. సాయంత్రం రద్దీ సమయంలో రహదారి రద్దీని మరింత తీవ్రతరం చేసింది.
Also read: తెలంగాణకు భారీ వర్ష సూచన…పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు!