Hyderabad: ట్యాంక్ బండ్‌పై కేక్ కట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది జీహెచ్‌ఎంసీ. ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది.

New Update
Hyderabad: ట్యాంక్ బండ్‌పై కేక్ కట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..

GHMC Bans Birthday Celebrations: హైదరాబాద్‌లో(Hyderabad) ఎవరిదైనా బర్త్‌డే ఉందంటే చాలు.. సెలబ్రేషన్స్ కోసం ప్రతి ఒక్కరికి మొదటగా గుర్తొచ్చే స్పాట్ ట్యాంక్‌బండ్(Tank Bund). తమ స్నేహితులు, సన్నిహితుల బర్త్‌డేలను ట్యాంక్ బండ్ మీద సెలబ్రేట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే, సెలబ్రేషన్స్ ఇక నుంచి కుదరదు. ట్యాంక్‌బండ్‌పై బర్త్ డే, మ్యారేజ్ డే సహా ఇతర సెలబ్రేషన్‌ నిర్వహించడంపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్స్‌ను నిషేధించింది జీహెచ్‌ఎంసీ. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

ట్యాంక్ బండ్ మీద బర్త్‌డే వేడుకలు నిర్వహించడం వలన పరిసర ప్రాంతాలు కలుషితం అవడమే కాకుండా.. రోడ్డుపై వెళ్తున్న వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మేరకు చాలా మంది జీహెచ్‌ఎంసీ ఫిర్యాదు చేశారు. భారీ ఎత్తున వచ్చిన ఈ ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు.. ట్యాంక్‌బండ్‌పై కేక్ కటింగ్స్‌ని నిషేధించారు. అంతేకాదు.. ట్యాంక్ పరిసరాల్లో చెత్తా చెదారం వేస్తే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా సెలబ్రేషన్స్ నిర్వహించినా.. నిబంధనలు అతిక్రమించినా.. సీసీ కెమెరాల ద్వారా గమనిస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు అధికారులు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదిలాఉంటే.. నగరంలో చాలా వరకు యువత ట్యాంక్ బండ్‌పై బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. అర్థరాత్రి వేళ కార్లలో వచ్చి, రోడ్లపైనే నిలిపి కేక్ కటింగ్స్ చేస్తారు. వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈ సెలబ్రేషన్స్ ఫలితంగా వారు వేసే చెత్తాచేదారంతో పరిసర ప్రాంతాలు, రోడ్లన్నీ కాలుష్యమయం అవుతున్నాయి. అంతేకాదు.. ఈ సెలబ్రేషన్స్ కారణంగా ఇతర వాహనదారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌ఎంసీకి అనేక ఫిర్యాదులు అందడంతో.. చర్యలు చేపట్టారు అధికారులు.

Also Read:

అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్

ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు