Anger : చీటికి మాటికి వచ్చే కోపం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి.. జాగ్రత్త!

బీపీ, గుండె జబ్బులు.. నిద్రలేమి... కోపంతో వచ్చే అనారోగ్యాలివే. కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక విపరీతమైన కోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

New Update
Anger : చీటికి మాటికి వచ్చే కోపం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి.. జాగ్రత్త!

Heart Problems : చాలా మందికి ప్రతి చిన్న విషయానికి విపరీతంగా కోపం(Angry) వచ్చేస్తుంది. ఇలా చీటికిమాటికీ కోపంతో ఊగిపోయే వారు అనేక అనారోగ్య సమస్య(Health Problems) లను ఎదుర్కొంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోపం తగ్గించుకోవాలని కొందరు ఎంత ప్రయత్నం చేసినా అదిసాధ్యం కాదు. అలాంటి వారు ఆహారంలో కోపానికి కారణం అయ్యే ఉప్పు(Salt), మసాలా(Masala) లకు దూరంగా ఉండాలి. ఇక కోపం తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చెయ్యాలి, లేదంటే ప్రమాదంలో పడేది వారి ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు.

తన కోపమే తన శత్రువు అని మన పెద్దవారు ఊరికే అనలేదు. ఇక నిత్యం విపరీతమైన కోపం తో బాధపడుతున్న వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి ఆరోగ్యం ఎంత పాడవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తరచూ కోపం తెచ్చుకోవడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయని, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కోపం ఒక వ్యక్తిని విపరీతమైన చిరాకుకు గురిచేస్తుంది. వారికి విరామం లేకుండా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి, దానివల్ల అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తుంది.

కోపంతో బీపీ, గుండె జబ్బులు.. నిద్రలేమి... వచ్చే అనారోగ్యాలివే... కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక విపరీతమైన కోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా రకరకాల సమస్యలు వస్తాయి. కోపం వల్ల పునరుత్పత్తి శక్తి కూడా తగ్గుతుంది.

కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు(Sleeping Problems) ఏర్పడతాయి. కోపం ఎక్కువగా రావడం వల్ల సరిగా ఆలోచించలేని పరిస్థితి వస్తుంది. మానసికంగా కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. మనలోని సృజనాత్మకత, ఆనందం రెండూ తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వల్ల పక్షవాతం బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

విపరీతమైన కోపం చేసే పని చేసే చోట తీవ్రమైన సమస్యలు వస్తాయి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో సంబంధాలు దెబ్బతింటాయి. విపరీతమైన కోపం వల్ల వాదోపవాదాలు జరుగుతాయి. ఫలితంగా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. పనిచేసే చోట కోపం ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకో లేకపోతే పని చేసే చోట కూడా గొడవలు అవుతాయి. ఆ ప్రభావం చేసే పని మీద కూడా చూపిస్తుంది.

కోపం వల్ల ఒక్కోసారి జీవితమే నాశనం అవుతుంది. కోపం మానసిక సంఘర్షణకు కారణం అవుతుంది. కోపం వల్ల కలిగే ఉద్రేకం బాధను కలిగిస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక కోపం ఒక్కో సారి దారుణాలకు కారణం అవుతుంది. క్షణికావేశంలో చెయ్యకూడని నేరాలు చేసేలా ప్రేరేపిస్తుంది. కోపం ఒక్కోసారి జీవితాలనే నాశనం చేస్తుంది.

Also read: నాలుగు రోజుల్లో 49 డిగ్రీలు..బయటకు వస్తే ఇక అంతే సంగతులు!

Advertisment
తాజా కథనాలు