Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం

ప్రతి ఒక్కరు ముఖంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మహిళల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. ఇంట్లో అరటిపండు, బొప్పాయి గుజ్జు-ప‌సుపు, నిమ్మకాయ రసం-షుగర్‌ వంటి ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే అవాంఛిత రోమాలు పోతాయి.

Unwanted Hair Pack: ఈ ప్యాక్‌తో అవాంఛిత రోమాలు మాయం
New Update

Unwanted Hair Pack: మానవ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇలా అవాంఛిత రోమాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖం ఎంత తెల్లగా ఉన్నా ఇలా వెంట్రుకల వల్ల అందం అంతా పోతుంది. కొందరు ఈ సమస్యను గట్టెక్కేందుకు లేజర్‌ చికిత్సను ఆశ్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఫలితం బాగానే ఉన్నా చాలా ఖర్చు అవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా అవాంఛిత రోమాలను నివారించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్‌ప్యాక్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండదు

మనకు ఇంట్లో అందుబాటులో ఉన్నవాటితో ఫేస్‌ ప్యాక్‌ చేసుకుని వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఫేస్‌ప్యాక్‌ వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌, స్కిన్‌కు కూడా హాని జరగదని అంటున్నారు. ఇలా శరీరంపై అవాంఛిత రోమాలు ఉంటే ఓట్స్‌ను వాడి తగ్గించుకోవచ్చు. గిన్నెలో 2 చెంచాల ఓట్స్‌ను పొడిగా చేసుకుని తీసుకోవాలి. తర్వాత అరటిపండు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని పావుగంట పాటు స్మూత్‌గా మసాజ్‌ చేసుకోవాలి. ఆరిపోయాక ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాలు పోతాయి. రోమాలతో పాటు స్కిన్‌పై ఉన్న మురికి, డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ పోతాయి.

ఇది కూడా చదవండి: కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగితే మంచిది..?

అంతేకాకుండా గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన తీసుకుని దానిలో బియ్యం పిండి వేసి ఆ పేస్ట్‌ను ముఖానికి రాసి మర్దనా చేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత కడుకుంటే ముఖంపై రోమాలు తొలగిపోతాయి. బొప్పాయి కూడా అవాంఛిత రోమాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని పపైన్‌ అనే ఎంజైమ్‌ అవాంఛిత రోమాలను కుదుళ్ల నుంచి పెరగకుండా అరికడుతుంది. గిన్నెలో బొప్పాయి గుజ్జును తీసుకుని దానిలో కొంచెం ప‌సుపు వేసి ఆ పేస్ట్‌ను ఫేస్‌కు రాసుకోవాలి. పావుగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే సమస్య తగ్గిపోతుంది. నిమ్మకాయ రసాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో షుగర్‌ వేసి 4 నిమిషాలు వేడి చేయాలి..అందులో కొన్ని నీళ్లు పోసి వ్యాక్స్‌లా అయ్యేలా చేసుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే రోమాలపై రాసుకోవాలి. తర్వాత వ్యాక్స్‌ పేపర్‌తో గట్టిగా ఒత్తిడి చేయాలి. ఆ తర్వాత పేపర్‌ను రివర్స్‌లో లాగాలి. ఇలా చేస్తే తొందరగా అవాంఛిత రోమాలు పోతాయి.

#health-tips #unwanted-hair #face-pack
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe