ప్రపంచం కరోనా మహమ్మారి నుంచి కోలుకుని సాధారణ జీవితంలోకి పూర్తిగా వచ్చేసింది. అయితే భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటివి వచ్చినట్లేతే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే సూచించింది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిర్లక్ష్యం ధోరణపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ఇది విఫలమైతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చు అంటూ హెచ్చరించింది.
Also Read: అయోధ్యలో మసీదు నిర్మాణం అప్పటినుంచే.. బాబ్రీ మసీదు పేరు మార్పు..
విఫలమైతే అంతే సంగతులు
ప్రపంచ దేశాలు నిబద్ధతకు అనుగుణంగా వ్యవహరించడం లేదని ఆందోళన చెందుతున్నానని బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ పేర్కొన్నారు. 'ఇందుకు సమయం తక్కువగా ఉంది.. కానీ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఈ ఒప్పందం చేసుకోవడంలో విఫలమైనట్లైతే ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే అవుతుంది. దీనివల్ల భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవట్టు. ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదుర్చుకునేందుకు అన్ని దేశాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలి అని' చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు.
Also Read: అయోధ్యలో బాలరాముడి దర్శన వేళలు ఇవే.. ఇలా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు
అలా జరిగితే ప్రమాదమే
అయితే ఈ ఏడాది మే నాటికి మహమ్మారి ఒప్పందానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐరాస సాధారణ సభలో ప్రపంచ నేతలు అంగీకరించనట్లు తెలిపారు. భవిష్యత్తులో మహమ్మారులను నిర్మూలించే దిశగా ముందుకెళ్లడం, ఇలాంటివి వస్తే సంసిద్ధంగా ఉండటం లాంటి వాటిపై గతంలోనే చర్చ జరిగిందని.. దీనిపై ఒప్పందాన్ని చేసుకోవాలని డిసెంబర్ 2021లో డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే 27 నిర్వహించే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వార్షిక సమావేశంలోగా ఇది పూర్తి చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయంలో ఎవరూ ముందుకు రాకుంటే.. ప్రాజెక్టు మొత్తం మూలనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు టెడ్రోస్.