General Elections 2024 Hyderabad MP Fight : లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) 195మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ(BJP) రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ రిలీజ్ తర్వాత మన హైదరాబాద్ మహిళ గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈసారి హైదరాబాద్(Hyderabad) లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ ఓ మహిళలను నిలబెట్టింది. నిజానికి MIM పార్టీకి హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో గెలుపు చాలా ఈజీ అని అందరికి తెలుసు. ముస్లిం సంఖ్య బలంగా ఉండే రీజియన్లు హైదరాబాద్‌లో ఎక్కువే ఉంటాయి. అందుకే ప్రత్యర్థి పార్టీలు సైతం హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఎలాగో ఒవైసీదేనని ఎప్పుడో ఫిక్స్ అయ్యాయి. అటు స్నేహంలో భాగంగా గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇటు బీజేపీ మాత్రం అంత ఈజీగా ఏది వదలకూడదని ఫిక్స్ అయ్యింది. హార్డ్‌కోర్ ముస్లిం నేతైన ఒవైసీపై హిందువ్వ భావజాలమున్న మాధవి లతని పోటికి దింపుతోంది. ఇంతకీ ఎవరీవడ?
ఎవరీ మాధవి లత?
--> విరించి హాస్పిటల్ చైర్ పర్సన్ డాక్టర్ మాధవి లత కొంపెల్లా(Dr. Madhavi Latha Kompella).
--> సోషల్ మీడియా(Social Media) లో మాధవి చాలా యాక్టివ్‌గా.
--> హిందుత్వ కోసం గొంతు విప్పడం మాధవి నైజం.
--> మాధవి లత ఆసుపత్రి చైర్‌పర్సన్‌నే కాదు.. భరతనాట్య నృత్యకారిణి కూడా.
--> ఆమె హైదరాబాద్‌లో అనేక సామాజిక సేవ కార్యక్రమాల్లో మాధవి పాల్గొన్నారు.
--> మాధవికి చెందిన ట్రస్టులు, సంస్థలు ఎక్కువగా ఆరోగ్య సంరక్షణ, విద్య రంగంలో పనిచేస్తున్నాయి. లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ అండ్ లతమా ఫౌండేషన్‌కు అధిపతి మాధవి.
--> రాజనీతి శాస్త్రంలో మాధవి ఎంఏ చేశారు.
ఒవైసీని నిలువరించగలర?
ప్రస్తుతం మాధవి నెట్టింట ఓ స్టార్. హిందూ మతానికి(Hinduism) సంబంధించిన ప్రసంగాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందారు. అందుకే బీజేపీ ఆమెకు ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చింది. అది కూడా హైదరాబాద్ నుంచి ఒవైసీ(OYC) పై పోటికి దింపింది. గతంలో ఈ స్థానం నుంచి భగవత్‌రావు పోటీ చేశారు. భగవత్ ఒవైసీ చేతిలో దాదాపు మూడు లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి బీజేపీ మహిళా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా టఫ్ ఫైట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఒవైసీని తన కోటలో ఓడించడం అంత సులభం కాదు. మరి ఇప్పుడు ఒవైసీ కంచుకోటలో హిందుత్వ ముఖం విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read : అటు టీడీపీ.. ఇటు వైసీపీ.. టార్గెట్ పవన్ కళ్యాణ్!! ఎందుకో మరి..