Telangana: పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి చివరి నెలలో విడుదల అయ్యే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మార్చి నెల చివరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎంపీ ఎలక్షన్స్‌లో తెలంగాణకు ఇన్‌ఛార్జిగా అమిత్ షా వస్తారని తెలిపారు కిషన్ రెడ్డి.

New Update
Kishan Reddy: బోనస్ అని చెప్పి బోర్లా పడేశారు.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో రివీల్ చేశారు. ఫిబ్రవరి నెల చివరలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు కిషన్ రెడ్డి. మార్చి నెలలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అంతేకాదు.. మరో కీలక విషయం వెల్లడించారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఏకంగా అమిత్ షానే తెలంగాణలో ఎన్నికలను పర్యవేక్షిస్తారట. పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణకు ఇన్‌ఛార్జ్‌గా అమిత్ షానే వ్యవహరిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణకు వస్తారని, అదే రోజున మధ్యాహ్నం 12 గంటలకు ఛార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. బీజేపీలోని ఒక్కో అగ్ర నేత ఒక్కో రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తారని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్ షా చూస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల వలె పార్లమెంట్ కు పోటీ చేసేందుకు పార్టీ తరపున ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకునేది లేదని, నేరుగా అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు కిషన్ రెడ్డి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో అధికారం తమదే అని పూర్తి విశ్వాసం ప్రకటించిన బీజేపీ నేతలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. పార్టీని గెలిపిస్తామన్న ముఖ్య నేతలే ఘోరంగా ఓడిపోయారు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో కనీసం 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని గట్టి సంకల్పంతో ఉంది. అందుకే.. నేరుగా అమిత్ షా నే రంగంలోకి దిగారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

Also Read:

అమ్మ కి’లేడీ’.. మాజీ ప్రియుడిపై పగతో మైండ్ బ్లాంక్ స్కెచ్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!

ఆయన సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు