Yuvraj Singh Clarifies on His Political Entry : లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) లలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు సినీ నటులతో పాటు క్రికెటర్లను(Cricketers) కూడా యూజ్ చేసుకోవాలని బీజేపీ(BJP) భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. క్రికెటర్లతో సహా ఇతర క్రీడా రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను బీజేపీ బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag), యువరాజ్ సింగ్(Yuvraj Singh) తో పాటు సినీ యాక్టర్లు అక్షయ్ కుమార్, జయప్రద లాంటి ప్రముఖులు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరందకుంది. ఎన్డీఏతో సంబంధం లేకుండా మెజారిటీ మార్క్ దాటాలదన్నదే బీజేపీ ఆలోచన. ఓవరాల్‌గా ఎన్డీఏ(NDA) తో కలుపుకోని 400కు పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ రాజకీయాలకు అతీతంగా ఇతర రంగాల నుంచి అనుభవజ్ఞులను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. అక్షయ్ కుమార్, యువరాజ్ సింగ్, పవన్ సింగ్, జయప్రద ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించారని, సెహ్వాగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కిరణ్ ఖేర్ స్థానంలో అక్షయ్ చండీగఢ్ నుంచి, సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి యువరాజ్ సింగ్ బరిలోకి దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. సెహ్వాగ్ అంగీకరిస్తే అతనికి ఢిల్లీ లేదా హర్యానాలో సీటు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందంట. అయితే జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా?
పోటి చేయడం లేదు?
టీమిండియా(Team India) కు 2007 టీ20 వరల్డకప్(T20 World Cup), 2011 వన్డే ప్రపంచకప్ అందించిన ఆటగాడు యువరాజ్ సింగ్. ఈ సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ పంజాబ్(Punjab) నుంచి ఎంపీగా పోటికి దిగుతారన్న టాక్‌లో ఏ మాత్రం క్లారిటీ లేదని తేలిపోయింది. ఎందుకంటే దీనిపై ఈ స్టార్ ఆల్‌రౌండరే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానే వార్తలను యువరాజ్ సింగ్ తోసిపుచ్చారు. మీడియా కథనాలకు విరుద్ధంగా ఆయన ట్వీట్ కనిపిస్తోంది. గురుదాస్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టతనిచ్చారు యువీ.
సినీ ప్రముఖులకు ఎర?
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ సీటులో టీఎంసీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా పై భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్‌ను పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. అటు క్రీడలు, వ్యాపారం, సామాజిక సేవతో పాటు అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో బీజేపీ టచ్‌లో ఉందని సమాచారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినీ రంగానికి సంబంధించిన వారిని బరిలోకి దింపేందుకు ఒప్పించే పనిలో పార్టీ బిజీగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 50కు పైగా ప్రముఖులను బరిలోకి దించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : తిక్క కుదిరింది.. కంట్రాక్ట్ లిస్ట్ నుంచి అయ్యర్-కిషన్ ఔట్.. ఎందుకంటే?