/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gambhir-varma-ravi-shastrii-jpg.webp)
Gautam Gambhir slams ravi shastri: మ్యాచ్ గెలవాలంటే ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడం ముఖ్యం అని.. అంతే కానీ లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలని.. రైట్ హ్యాండర్ల సంఖ్య ఇంతే ఉండాలని సలహాలు ఇవ్వడం సరైనది కాదన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్. బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్-7 ప్లేయర్లలో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలని మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాడు. ప్లేయర్లు ఏ హ్యాండ్ బ్యాటర్ అన్నదానిపై కాకుండా ఆటపై దృష్టి పెట్టాలని గంభీర్ నొక్కి చెప్పాడు. ఎడమ చేతి వాటం లేదా కుడిచేతి వాటం లేదా మనకు ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు అన్నది పనికిరాని చర్చ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తిలక్‌ని ఆడించాలి:
తిలక్ వర్మ(లెఫ్ట్ హ్యాండర్)కి వరల్డ్ కప్‌కి ముందే అవకాశాలు ఇవ్వడం, పరీక్షించడం మంచి విషయమన్నాడు గంభీర్. అయితే తిలక్‌ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ తిలక్ రాణిస్తే ఇతర విషయాలు ఆలోచించకుండా ప్రపంచ కప్‌కి ఎంపిక చేయాలని కోరాడు.
రవిశాస్త్రి ఏమన్నాడంటే?
ఆసియా కప్ జట్టు ఎంపికకు ముందు కనీసం ముగ్గురు ఎడమచేతి వాటం ఆటగాళ్లను భారత టాప్ సెవెన్‌లో చేర్చాలని రవిశాస్త్రి కోరాడు. 2019 ప్రపంచ కప్‌లో మొదటి ఏడుగురి బ్యాటర్లలో కేవలం ఒక్కరే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడని.. ఇది అప్పటి సెమీస్ ఓటమికి ఒక కారణమన్నాడు. కేవలం పంత్ మినహా మరో స్పెషలిస్ట్ లెఫ్ట్ హ్యాండర్ లేడని గుర్తు చేశాడు. చేసిన తప్పే మరోసారి చేయవద్దని సూచించాడు. ఇక శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ సహా ఆసియా కప్ కోసం 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. అయ్యర్ ,రాహుల్ ఇద్దరూ గాయం నుంచి కోలుకున్నారు. అదే సమయంలో వన్డే జట్టులోనూ తెలుగు కుర్రాడు తిలక్ కలిశాడు.