Garika Grass Health Benefits: సాధారణంగా గడ్డిపోచను తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ ఈ గరికతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పెరుగుతున్న పని ఒత్తిడి, జీవన విధానంలో ఎక్కువ మందికి తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి రాగానే కాఫీలు, టీలు తాగుతుంటారు. మరికొందరు మాత్రలతో మ్యానేజ్ చేసేస్తుంటారు. కాఫీలు, టీల వరకు పర్వాలేదు కాకపోతే మిగతా వాటివల్లే దుష్పరిణామాలు తలెత్తుతాయని అంటున్నారు. తలనొప్పి వచ్చినప్పుడు కొద్దిసేపు చూసి అప్పటికీ తగ్గకపోతే సహజసిద్ధమైన పద్ధతుల్లో తగ్గించుకోవాలి. ఇలా తలనొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: మల్లెపూలతో టీ.. ఎప్పుడైనా ట్రై చేశారా?
ఆయుర్వేదంలో గరికకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని గరిక కాపాడుతుంది. గణేశుడికి పూజ చేసే సమయంలో గరికను వాడుతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ఆహార పదార్థాలు, నీళ్లపై గరికను ఉంచుతారు. ఎలాంటి వైరస్‌లు అటాక్ చేయకుండా గరిక కాపాడుతుందని నమ్ముతారు. ఈ గరికలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంటుంది. అందులో తలనొప్పి ఒకటి. తలనొప్పి ఎక్కువగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ గరిక గడ్డితో తీసిన రసంలో అర చెంచా అతిమధురం పౌడర్ కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు.
ఎండు ద్రాక్ష, బాదం కలిపి తింటే తలనొప్పికి చెక్
అలాగే ఈ గరికతో పాటు ఎండు ద్రాక్ష, బాదం కలిపి తిన్నా తలనొప్పి తగ్గిపోతుంది. బాదంపప్పులు, ఎండు ద్రాక్షను ఐదు చొప్పున కలిపి తింటే బాగుంటుంది. అవి తిన్న తర్వాత గోరు వెచ్చటి పాలు తాగితే తలనొప్పి మాయం అవుతుంది. అంతేకాకుండా ధనియాలతో చేసిన కషాయం కప్పు తాగినా తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎన్ని చిట్కాలు వాడినా తలనొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.