/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Dandia-jpg.webp)
దసరా పండుగ నేపథ్యంలో దేవీ నవరాత్రులు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతటా సందడి వాతావరణం నెలకొంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో గార్భా, దాండియా ఆటలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గార్భా వేడుకలను ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ దాండియా ఆటలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. జైల్లో కొందరు మహిళా ఖైదీలు దాండియా ఆడుతూ సందడి చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సెంట్రల్ జైల్లో కూడా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. దసరా పండుగ సందర్భంగా గార్భా, దాండియా వేడుకలను నిర్వహించారు. అయితే ఈ వేడుకలో భాగంగా జైల్లో ఉన్న మహిళా ఖైదీలు దాండియా ఆడుతూ అక్కడున్నవారందరిని ఆకట్టుకున్నారు. గత ఏడాది కూడా ఇండోర్ సెంట్రల్ జైల్లో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు.
Also Read: ఆ రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది పోటీ చేయనున్నారంటే
ఇక్కడ ప్రతి ఏడాది మహిళా ఖైదీలు ఈ గార్భా వేడుకల్లో పాల్గొంటారు. దాండియా ఆడుతూ.. ఆ మహిళా ఖైదీలు తమ బాధలు, కష్టాలను మరిచిపోతున్నారు. దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న జైలు అధికారులకు మహిళా ఖైదీలు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక గార్భా, దాండియా ఈ రెండూ కూడా గుజరాతి నృత్యాలే. లయబద్ధమైన దాండియా కర్రలతో దరువు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ ప్రదర్శించే నృత్యాన్నే దాండియా అంటారు. రంగురంగుల కర్రలతో దాండియా ఆడటం దీని ప్రత్యేకత. దాండియా ఆడేందుకు బృందంలో సరి సంఖ్యలో వ్యక్తులు ఉండాల్సి ఉంటుంది. ఇక ఇందులో పాడే పాటలు కృష్ణలీల గురించే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గార్బా, దాండియా రెండూ కూడా నవరాత్రి సమయంలో చేసినప్పటికీ వీటిలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఆ మహిళా ఖైదీలు దాండియా ఆడుతున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయ్యండి.
#WATCH | Madhya Pradesh: Garba organised in Indore Central Jail on the occasion of #Navratri2023pic.twitter.com/Y4pct1TL8x
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 20, 2023