EX Minister Ganta: సీటు విషయం తేల్చుకునేందుకు చంద్రబాబును కలిసిన గంటా!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి చంద్రబాబును కలిశారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచే పోటీ చేయమని చెబుతున్నారు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

New Update
EX Minister Ganta: సీటు విషయం తేల్చుకునేందుకు చంద్రబాబును కలిసిన గంటా!

Ex Minister: ఏపీలో(AP) ఎన్నికలు (Elections)వస్తున్న తరుణంలో సీనియర్ నేతలు చాలా మంది తమ సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలనుకుంటున్న కొందరు నేతలు బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.

చంద్రబాబును (CBN) కలిసిన వారిలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) , పి నారాయన ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి చంద్రబాబును కలిశారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచే పోటీ చేయమని చెబుతున్నారు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

చంద్రబాబు ముందు నుంచి కూడా గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చెబుతున్నారు. అయితే గంటా మాత్రం అక్కడ నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు. నిన్న కూడా చంద్రబాబును కలవగా ఆయన అదే మాట చెప్పారు. అయితే ఈ విషయం గురించి గంటా తన తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ విషయం గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. గంటా టీడీపీని వీడేందుకు రెడీ అయ్యారని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం అయిష్టంగా అయినా సరే ఆయన టీడీపీలోనే ఉంటారని అంటున్నారు.

తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా తీసుకునే నిర్ణయం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. చీపురుపల్లిలో పోటీ గురించి గంటా గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కొద్దిరోజుల క్రితం గంటా ముఖ్యమంత్రి జగన్‌ ను విమర్శించారు. విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని, ఇక్క‌డే ఉంటాన‌ని సీఏం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో స్పందించారు.

అదిగో వ‌స్తా.. ఇదిగో వ‌స్తాన‌ని చెబుతూ ఐదేళ్లు కాలం వెళ్ల‌దీశార‌ని విమర్శలు గుప్పించారు. ‘నెలలో వస్తా.. సంక్రాంతి కి వస్తా.. ఉగాదికి వస్తా..’ అంటూ ఐదేళ్ళ అంకం ముగిసిపోయింద‌ని చురకలు వేశారు.‘మీరు రేపు గెలిచేది లేదు.. ప్ర‌మాణస్వీకారానికి వ‌చ్చేది లేద‌ని’ అంటూ గంటా కౌంటర్ వేశారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ గా ఉన్న విశాఖ‌ను సీఏం జ‌గ‌న్.. ‘సిటీ ఆఫ్ డేంజర్‌’గా మార్చేశార‌ని విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే విశాఖ‌ను రాజ‌ధాని పేరిట ర‌ణ‌రంగ క్షేత్రంగా మార్చార‌ని ఫైర్ అయ్యారు

Also read: మిస్సైన విద్యార్థినులను పట్టుకున్న పోలీసులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు