AP News: జగన్‌పై గంటా శ్రీనివాసరావు మండిపాటు.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం

సీఎం జగన్‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విరుచుకు పడ్డారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి గ్రామంలో ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

New Update
AP News: జగన్‌పై గంటా శ్రీనివాసరావు మండిపాటు.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం

Ganta Srinivasa Rao: ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాలపై విరుచుకుపడ్డారు. అక్రమ కేసులతో చంద్రబాబు నాయుడును జైలులో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేక కేసులలో ఆర్ధిక నేరస్థుడిగా18 నెలలు జైలులో ఉండి రావడం వలన మచ్చ లేని చంద్రబాబుపై ఎలా అయినా బురద జల్లి నేరస్థుడిగా చిత్రీకరించడమే వైసీపీ టార్గెట్‌ అని ఆయన ఆరోపించారు. అందుకోసమే కనీసం ఆధారాలు కూడా లేని కేసులో చంద్రబాబును ఇరికించి రిమాండ్‌లో ఉంచి ఇది శాశ్వతం అని భావిస్తున్నారని గంటా తెలిపారు.

కడిగిన ముత్యంలా బయటకి వస్తారు

కానీ అది జరగని పని అని త్వరలోనే చంద్రబాబు అన్ని కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకి వస్తారని గంటా అన్నారు వైనాట్ 175 అని బయటకు డాంబికాలు పలుకుతున్న జగన్‌కి ఇవే చివరి ఎన్నికలని..ఈ సారి 1 కానీ, 7కానీ, 5 కానీ సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఎద్దేవా చేశారు దొంగ జీవోలతో ఋషికొండను ధ్వంసం చేస్తున్న ఘటన జగన్‌కే దక్కుతున్నారు. ఈ సారి ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 3 పార్లమెంట్ స్థానాలు,15 శాసనసభ స్థానాలు టీడీపీ- జనసేన పొత్తుతో సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కనీసం వైసీపీకి ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని గంటా వ్యాఖ్యానించారు.

మీ హామీలను చేసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో 99 శాతం నెరవేర్చామని సిగ్గులేకుండా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని లేదు.. మద్యపాన నిషేధం లేదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదు, సీపీస్ రద్దు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉందని గంటా శ్రీనివాస్‌రావు తెలిపారు. ఏమాత్రం సిగ్గులేకుండా హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకోవడం ప్రజలంతా నవ్వుకుంటున్నారని గంటా ఆరోపించారు. చివరికి ధర్మమే గెలుస్తుందని త్వరలోనే చంద్రబాబు అన్నికేసులలో నిర్దోషిగా విజయం సాధిస్తారని గంటా ఆకాక్షించారు.

ఇది కూడా చదవండి: వైభవంగా వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు..పాల్గొన్న జగ్గిరెడ్డి దంపతులు

Advertisment
తాజా కథనాలు