Vadapalli Venkateswara Brahmotsavam: అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 4వ రోజు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, పంచామృత మండపారాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయింది. స్వామివారికి అంగరంగ వేభోగంగా కళ్యాణోత్సవం ఆలయ అర్చకులు నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభత్వ విఫ్ చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే జగ్గరెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో వేదపండితులతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు. సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారికి కళ్యాణోత్సవం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు. వివిద రాష్ట్రాలకు చెందిన మంగళ వాయిద్యాలు తీన్మార్ డప్పులు కళారూపాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది.
పూర్తిగా చదవండి..Vadapalli Venkateswara: వైభవంగా వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు..పాల్గొన్న జగ్గిరెడ్డి దంపతులు
వాడపల్లి దివ్యక్షేత్రంలో శ్రీదేవీ భూదేవీ సమేతుడై స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైవభవంగా కొనసాగుతున్నాయి. కన్నుల పండువగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది.
Translate this News: