Anakapalle: అనకాపల్లి హత్యకేసు మిస్టరీ....ఆమె ఎవరంటే?
అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. ఆ మహిళ హత్యను పోలీసులు చేధించారు. కాగా హత్యకు గురైన వ్యక్తి హిజ్రాగా గుర్తించారు.
Ap Crime: అమ్మా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా.. నా చావుకి కారణం అదే: శ్రీ చైతన్య స్టూడెంట్ సూసైడ్!
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో విషాదం చోటుచేసుకుంది. కోనవానిపాలెంలో ఇంటర్ విద్యార్థిని సృజన ఆత్మహత్యకు పాల్పడింది. అనారోగ్య సమస్యలతో ఉరేసుకుంది. తుని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సృజన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.
AP News: వాహనాలు చోరీ చేసిన వ్యక్తి అరెస్టు
AP News:ఆటో తో సహా రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా యలమంచిలి సీఐ ధనుంజయరావు తెలిపారు. మంగళవారం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సావిత్రి తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో చోరీ వివరాలను వెల్లడించారు.
AP: ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి..!
అనకాపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. రాంబిల్లి సెజ్‌లోని వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుడు ఒడిశాకు చెందిన ప్రదీప్‌రౌత్‌గా గుర్తించారు. ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు.
AP: పూరిగుడిసెలో 12 అడుగుల భారీ గిరినాగు.. తాటాకుల మధ్య తిష్ట వేసి..!
అనకాపల్లి జిల్లా రైవాడలో 12 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. ఓ పూరిగుడిసెలో దాటాకులు మధ్య తిష్ట వేసి బుసలు కొట్టడంతో గుడిసెలో నివాసం ఉంటున్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు గంట పాటు శ్రమించి.. ఓ గోనె సంచిలో బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
AP Politics: భూములు కొట్టేయాలని జగన్ ప్లాన్: బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ జగన్మోహన్రెడ్డి ప్రజల భూములను కొట్టేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. పేదవాడికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేని విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం ఉందని అన్నారు.
Crime News: లారీ ఢీకొని ముగ్గురు మృతి..!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం చోటుచేసుకుంది. లారీ బైకును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దుప్పుతూరి నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ధర్నా చేపట్టారు.
Janasena : అనకాపల్లిలో జనసైనికుల వినూత్న ప్రచారం..!
అనకాపల్లి నియోజకవర్గంలో జనసైనికులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొణతల రామకృష్ణను గెలిపించాలని టీ తాగండి..గాజు గ్లాస్ కి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేపట్టారు. స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్ లో ప్రజలకు టీ అందిస్తూ గాజు గ్లాస్ విశిష్టతను వివరిస్తున్నారు.