Kothagudem : ‘పుష్ప’కు మించిన ప్లాన్.. పనసకాయాల్లో గంజాయి తరలింపు!

తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో పుష్ప సినిమాకు మించిన ప్లాన్‌తో పనసకాయల లోడులో తరలిస్తున్న 165 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.

New Update
Kothagudem : ‘పుష్ప’కు మించిన ప్లాన్.. పనసకాయాల్లో గంజాయి తరలింపు!

Ganja Seized : తెలంగాణ (Telangana) లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో పుష్ప (Pushpa) సినిమాకు మించిన ప్లాన్‌తో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా గుడి వద్ద ఎస్సై శ్రీరాముల శ్రీను తన సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్ (Hyderabad) ధూల్ పేట్ కి బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పోలీసులకు చిక్కింది. అయితే పనసకాయ లోడులో 165 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు పోలీసులు.

ఈ చర్యలకు పాల్పడిన విక్రమ్ సింగ్, శైలేందర్ సింగ్, చింతమన్ సంతోష్ సింగ్, రామ్ పూరి గోపి సింగ్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఆదిత్య సింగ్, మహేందర్ సింగ్ అనే వ్యక్తులకు అమ్మడానికి గంజాయిని తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. 359 కేజీల గంజాయి విలువ రూ.89 లక్షల 83 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 11 మంది నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు.

Also Read : గుజరాత్ నుంచి ఢిల్లీ వరకూ 24 గంటల్లో మూడు అగ్నిప్రమాదాలు.. బూడిదైన 42 ప్రాణాలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు