కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే

విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై గంగూలీ మరోసారి స్పందించారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీనే టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తప్పకోమని మాత్రమే సూచించానన్నారు.

New Update
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే

BCCI President Sourav Ganguly Reacted to Virat Kohli : ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా అప్పుడు బీసీసీఐ (BCCI)అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ (Sourav Ganguly)దీనికి కారణమంటూ పెద్ద ఎత్తున వివాదాస్పదమైన వార్తలొచ్చాయి. కోహ్లీ కూడా తనను ఆకస్మికంగా తప్పించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై గతంలోనూ చాలాసార్లు మాట్లాడిన గంగూలీ మరోసారి రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Also read :అత్యంత సేఫ్ సిటీగా కోల్ కతా.. హైదరాబాద్ కు ఎన్నో స్థానం తెలుసా?

‘నేను విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. కోహ్లీ టీ20లకు నాయకత్వం వహించడానికి ఆసక్తి చూపలేదు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అతడికి ఒక విషయం చెప్పా. కెప్టెన్సీపై ఆసక్తి లేకపోతే మొత్తం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిదని సూచించా’ అని గంగూలీ చెప్పాడు. అలాగే రోహిత్‌ శర్మ తొలుత మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటానికి ఆసక్తి చూపలేదని గంగూలీ పేర్కొన్నాడు. ‘రోహిత్‌ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ వహించడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. నేను అతడిపై ఒత్తిడితో చివరకు అంగీకరించాడు. కానీ, ఎవరు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నా మైదానంలో బాగా ఆడేది ఆటగాళ్లే. తాను భారత క్రికెట్ అభివృద్ధికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను అంతే. ఇది ఒక చిన్న భాగం’ అని దాదా వివరించాడు. ఆ తర్వాత విరాట్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకుని ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు