హిందూ ధర్మం ప్రకారం..పూజలు, వ్రతాలు ఎంతో నియమ నిష్టాలతో నిర్వహిస్తారు. మడి ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తారు. పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కలకు కూడా నాన్ వెజ్ వాసనలు కూడా దగ్గరకు రానివ్వరు. అలాంటిది గుడిలో ఉన్న దేవుడికి నైవేద్యంగా మాంసం పెడితే ....ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు కదూ.
కానీ ఓ వినాయకుడి(Lord Ganesha) ఆలయంలో వినాయకుడికి మాంసం నైవేద్యంగా పెడుతున్నారు. ఇది ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో అనుకుంటే పొరపాటే..ఈ ఆలయం కర్ణాటకలోని ఓ వినాయకుడి గుడిలో స్వామి వారికి నైవేద్యంగా మాంసం, చేపలు, చికెన్ ప్రసాదంగా (Non - Veg) పెడుతున్నారు. సావాజీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఎన్నో తరాల నుంచి ఇలా స్వామి వారికి మాంసాన్ని ప్రసాదంగా సమర్పించడం ఒక ఆచారం నడుస్తోంది. అక్కడి ప్రజలు శ్రావణ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ నెల రోజులు కూడా వారు మాంసాన్ని ముట్టుకోరు.
శ్రావణ మాసం మొదలైన తరువాత వినాయక చవితి వరకు సావాజీ కమ్యూనిటీ వారు మాంసాన్ని ముట్టుకోరు. వినాయక నవరాత్రులు మొదలైన తరువాత వారు ముందుగా వినాయకునికి నాన్ వెజ్ నైవేద్యంగా పెట్టి అప్పుడు మాంసాన్ని తింటారు. ఈ క్రమంలో చాలా మంది మటన్ వంటకాలతో పాటు...మరి కొంతమంది చేపలు, చికెన్ కూడా సమర్పిస్తారు.
వినాయకుని వాహనమైన మూషికానికి చేపలు అంటే ఇష్టం అవ్వడంతో ఎక్కువ మంది చేపలు ఇక్కడ స్వామి వారికి సమర్పిస్తారు. అయితే ఈ ఆచారం ఎన్నో వందల సంవత్సరాల క్రితం ప్రారంభం అయినట్లుగా సావాజీ కమ్యూనిటీ పెద్దలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ నాన్ వెజ్ నైవేద్యం గురించి బయటకు వచ్చింది.
ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్దలతో చేసుకునే వినాయక చవితి నాడు..స్వామి వారికి ఇలా మాంసం పెట్టడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.